Sciatica , సయాటికా సమస్య ఉన్న వారికీ తీసుకో వలిసిన జాగ్రత్తలు పరిష్కారం మార్గం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
అసలు సయాటికా అంటే ఏమిటి ? ->
మన శరీరంలోని అన్ని నరాల్లోనూ పొడవైన నరం సయాటిక్ నరం. ఇది నడుములోని వెన్నుపామునుంచి ప్రారంభమై పిరుదులనుంచి పిక్కలకూ, అక్కడనుంచి దిగువకూ ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. కాలులో ఉండే అనేక కండరాలను, ఇతర నిర్మాణాలను ఇది నియంత్రిస్తుంది. తొడలు, పిక్కలు, పాదాల్లో స్పర్శను గ్రహించడానికి తోడ్పడుతుంది.
సయాటిక్ నరం ప్రయాణించే మార్గంలో నొప్పి వస్తున్నప్పుడు సయాటికా అనే పేరుతో వ్యవహరిస్తారు. నిజానికి సయాటికా అనేది ఒక లక్షణం. వెన్నుపూసల మధ్యనుండే డిస్కు జారటం వంటి వ్యాధి స్థితులను అనుసరించి ప్రాప్తించే నరాల వ్యాధి స్థితి. . సయాటికా నొప్పి వచ్చినప్పుడు కుంగిపోకుండా తగిన చికిత్సలు తీసుకుంటూ, సరైన జాగ్రత్తలు పాటిస్తే 4 నుంచి 8 వారాల్లోనే తగ్గిపోతుంది.
ప్రధాన లక్షణాలు
సయాటికా వ్యాధి స్థితిలో కొన్ని ప్రధానమైన లక్షణాలుంటాయి. ఇవి అన్ని సందర్భాల్లోనూ, అందరిలోనూ ఒకేసారి కనిపించకపోవచ్చు. లేదా కలిసికట్టుగా కనిపించవచ్చు.
నొప్పి
నములుతున్నట్లు ఉండే నొప్పి ముందుగా నడుములో ప్రారంభమై పిరుదులలోకి, అక్కడనుంచీ తొడల్లోకి, అక్కడనుంచి పిక్కల్లోకి ప్రసరించడం సయాటికా నొప్పిలో ప్రధాన లక్షణం. సయాటిక్ నరం ప్రయాణించే మార్గం మొత్తం నొప్పిగా అనిపించవచ్చు. ముఖ్యంగా తొడ వెనుకభాగంలోనూ, పిక్కల్లోనూ నొప్పి స్పష్టంగా తెలుస్తుంది. నొప్పి లక్షణాలు వివిధ రకాల స్థాయిల్లో ఉంటాయి. నొప్పి అస్పష్టంగా ఉండవచ్చు లేదా తీక్షణాతి తీక్షణంగా, పదునుగా ఉండవచ్చు. కేవలం అసౌకర్యంగా మాత్రమే ఉండవచ్చు. లేదా షాక్ కొట్టినట్లు ఝల్లుమనవచ్చు. దగ్గినప్పుడు గాని, తుమ్మినప్పుడుగాని, ఎక్కువసేపు కూర్చున్నపుడుగాని సమస్య తీవ్రతరమవ్వవచ్చు. రెండు కాళ్ళలోనూ ఒకే స్థాయిలో కాకుండా సాధారణంగా ఏదో ఒక కాలులో లక్షణాలు ఎక్కువ తీవ్రతతో కనిపిస్తాయి.
తిమ్మిర్లు, కండరాల్లో బలహీనత
సయాటిక్ నరం ఒత్తుకుపోవడంవల్ల కాలులో తిమ్మిరిగా అనిపిస్తుంది. ముఖ్యంగా నరం ప్రయాణించే మార్గంలో- అంటే కాలులోనూ, పాదంలోనూ మొద్దుబారినట్లు అనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక కాలులో నొప్పిగా అనిపిస్తే మరో కాలులో తిమ్మిర్లుగా అనిపిస్తుంది.
సూదులు గుచ్చుకుంటున్నట్లు చిటపటలాడటం
ఇది సయాటికా వ్యాధి స్థితిలో మరో ప్రధానమైన లక్షణం. సాధారణంగా ఈ లక్షణం కాలు మొత్తంలో కాకుండా పాదంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
మలమూత్రాలమీద నియంత్రణ కోల్పోవటం
ఇది చాలా అరుదుగా కనిపించే లక్షణం. అయితే చాలా ప్రమాదకరమైన స్థితిని సూచిస్తుంది. మలమూత్రాలమీద నియంత్రణ తప్పడాన్ని వైద్యశాస్త్ర పరిభాషలో ‘కాడా ఈక్వినా సిండ్రోమ్’ అంటారు. దీనికి సత్వరమే వైద్య సహాయం పొందాలి.
కారణాలు
హెర్నియేటెడ్ డిస్కు : హెర్నియేషన్ అంటే వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు వెలుపలకు చొచ్చుకువచ్చి వెన్నుపామును నొక్కటం. సయాటికా నొప్పికి అతి ప్రధానమైన కారణమిది. దీనివల్ల సయాటిక్ నరం ప్రారంభపు భాగంలో ఒత్తుకుపోయి నొప్పి వస్తుంది. దీనిని అర్థం చేసుకోవాలంటే వెన్ను గురించి కొంత అవగాహన ఉండాలి. నడుము భాగంలోని వెన్నుపూసలను లంబార్ వర్టిబ్రే అంటారు. వీటి మధ్య మృదులాస్తితో తయారైన డిస్కులు ఉంటాయి. ఇవి వెన్నుపూసలను తేలికగా ఒకదానిమీద మరోటి కదలడానికీ, వంగడానికీ, ఆడటానికీ సహాయపడతాయి. అలాగే కదలికల సమయంలో జనించే ఒత్తిళ్ళను గ్రహిస్తూ ‘షాక్ అబ్జార్బర్స్’గా పనిచేస్తాయి. వయసు పెరిగేకొద్దీ ఈ డిస్కులు దెబ్బతినడం మొదలెడతాయి. ఉదాహరణకు, శుష్కించిపోవచ్చు లేదా మందం తగ్గిపోవచ్చు లేదా స్నిగ్ధత్వం కోల్పోయి పెళుసుగా తయారుకావచ్చు. సమయం గడిచే కొద్దీ డిస్కు వెలుపల భాగాన్ని ఆవరించి ఉండే తంతుయుతమైన యాన్కులస్ అనే నిర్మాణంలో పగుళ్లు తయారవుతాయి.
ఫలితంగా ఈ పగుళ్లనుంచి డిస్కు మధ్యభాగంలో ఉండే జిగురు వంటి పదార్థం వెలుపలకు చొచ్చుకు వస్తుంది. ఈ ప్రక్రియను వైద్య పరిభాషలో హెర్నియేషన్ అంటారు. దీనివల్ల సయాటిక్ నరం ప్రారంభ భాగంలో (మూలంలో) నొక్కుకుపోయి నడుములోగాని లేదా కాలులోగాని లేదా రెంటిలోగాని నొప్పి మొదలవుతుంది. ఒకవేళ నడుము చివరి భాగంలోని వెన్నుపూసల మధ్యన ఉండే డిస్కులు దెబ్బతింటే నొప్పితోపాటు తిమ్మిరి, సూదులు గుచ్చినట్లు ఉండటం, కండరాల బలహీనత వంటివి సైతం అనుభవమవుతాయి.
లంబార్ స్పైనల్ స్టీనోసిస్ : వెన్నుపూసల మధ్య ఉండే స్పైనల్ కెనాల్ అనే ఛానెల్‌లో వెన్నుపాము ప్రయాణిస్తుంది. వెన్నుపాము అనేది అనేక నరాల తంతువుల సముదాయం. నరాలు కట్టకట్టినట్లు ఒక పెద్ద తాడు మాదిరిగా అమరి వెన్నుపాముగా రూపుదాల్చుతాయి. దీని నుండి నరాల శాఖలు వెన్నుపూసల ద్వారా వెలుపలకు వస్తాయి. ఇవి శరీరానికి, మెదడుకూ మధ్య సమాచార వ్యవస్థను కొనసాగిస్తుంటాయి. ఒకవేళ ఏదైనా కారణం చేత వెన్నుపాము ప్రయాణించే కెనాల్ ఇరుకుగా మారితే కెనాల్ స్టీనోసిస్ అంటారు. ఇలా జరగటంవల్ల నరాల మీద ఒత్తిడి పడుతుంది. నరాల అధీనంలో ఉండే కండరాల్లో నొప్పి అనుభవమవుతుంది. వెన్ను చివరి భాగంలో ఒత్తిడిపడితే నడుము భాగానికి, కటి భాగానికి ప్రయాణించే నరాలు దెబ్బతింటాయి.
స్పాండిలో - లిస్థిసిస్ : వెన్నుపూసల మధ్యన ఉండే డిస్కులు శుష్కించిపోవటంవల్ల వెన్నుపూసలు ఒకదానిమీద మరోటి సరిగా అమరకుండా ముందుకు జరుగుతాయి. దీనితో, వాటిమధ్యనుంచి వెలుపలకు వచ్చే సయాటిక్ నరం మీద ఒత్తిడి పడుతుంది.
పైరీఫార్మిస్ సండ్రోమ్
పైరీఫార్మిస్ అనే కండరం సయాటిక్ నరంపైన అమరి ఉంటుంది. నడుము భాగంలోని వెన్ను వద్దనుంచి ప్రారంభమై తొడ ఎముక (ఫీమర్) వద్దకు వచ్చి అంతమవుతుంది. ఒకవేళ ఈ కండరంలో ఒత్తిడి పెరిగితే కండరం బిగుసుకుపోవటంతోపాటు సయాటిక్ నరం మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. నొప్పి నడుమునుంచి మొదలై తొడవరకూ విస్తరిస్తుంది. అయితే మోకాళ్ళకంటే క్రిందకు ప్రసరించదు. ఎక్కువ సమయంపాటు కూర్చోవటం, మోటారు వాహనాల యాక్సిడెంట్లు, నడుస్తున్నప్పుడు జారి కింద పడటం వంటివాటివల్ల పైరీ ఫార్మిస్ సిండ్రోమ్ ప్రాప్తిస్తుంది.
స్పైనల్ ట్యూమర్స్ : వెన్నుపాములోని అంతర్గత భాగంలోగాని, వెన్నుపామును కప్పి ఉంచే పొరల్లో (మెనింజెస్)గాని, వెన్నుపాముకు, వెన్నుపూసలకూ మధ్యన ఉండే ప్రదేశంలోగాని పెరుగుదలలు తయారైనప్పుడు వెన్నుపాము నొక్కుకుపోయి సైయాటికా వస్తుంది.
చికిత్స : Treatment
- రెస్ట్ (విశ్రాంతి ) తీసుకోవాలి . మంచి పోషకాహారము తినాలి .
- నొప్పి నివారణ కోసము పైన్ కిల్లర్స్ వాడాలి , Aceclofenac 100 mg 3 times /day .Or Nimsulide 100 mg 3 times/day చొప్పున్న 3-4 వారాలు వాడాలి .
- కండరాల బిగువు తగ్గడానికి మజిల్ రిలాక్షెంట్స్ ను వాడాలి . Chlormezanone . or Chloroxazone 500 mg 3 timme /day 3-4 వారాలు వాడాలి .
- ట్రాక్షన్ & ఫిజియో తెరఫీ కొంతవరకు ఉపయోగపడును .
- ఎముకల స్పెసలిస్ట్ లతో కలిసి న్యూరోసర్జన్ చే ఆపరేషన్ చేయించుకుంటే చాలా మటుకు బాధ నివారణ అగును .
సయాటికా ఆయుర్వేద వైద్యం
సయాటికా ఆయుర్వేద వైద్యం
తుంటి నుండి వెనుకవైపు, ప్రక్కల విపరీతమయిన నొప్పి, తిమ్మిరిగా ఉండటం, రెండు కాళ్ల కండరాలు బలహీనపడటం, సూదులు పొడిచినట్లుండటం, అశాంతి ఇవి సైయాటికా నొప్పిని సూచిస్తాయి. అసలు సయాటికా అనేది మన శరీరంలో అతి పెద్ద నరం. ఇది నడుం నుండి పిరుదుల వెనుకకు ఉంటుంది. ఇది వెన్నుపూసలలో చివర ఉన్న నాలుగు అయిదు లంబారు పూసలు మొదటి సేక్రల్ పూసల మధ్య నుండి వెలువడి సేక్రల్‌ప్లెగ్జేస్ అనే నరాల కూటమి నుండి వచ్చి నడుం కింద భాగాలని, తొడలు, కాళ్లు, అరికాళ్లు వీటిలో కదలికని, స్పర్శని కలుగచేస్తుంది.
ఇది శరీరంలో అత్యంత బలమైన నరం. దీనికి రెండు ఉపనరాలు అనుసంధానంగా ఉంటాయి. అవి కామన్ పెరోనియల్, టిబియల్ అనేవి. ఇవి మోకాలు కింద కండరాలని పాదాలు కాలివేళ్ల కండరాలకి స్పర్శని, కదలికని కలుగచేస్తుంది. ఆధునిక వైద్య శాస్త్ర రీత్యా సైయాటికా అంటేనే సయాటికా నరానికి వచ్చిన లోపాల వల్ల వచ్చే నొప్పి అని నిర్వచించవచ్చు. ఈ నరం చుట్టూ ఉన్న పొర వాయటం వల్ల కాని, నరాల మూలంపై ఏదైనా ఒత్తిడి కాని కారణం కావచ్చు. నిజానికి ఇప్పటి వరకూ ఈ నొప్పికి మందులంటూ ఏమీ లేవ్ఞ. పూర్తి విశ్రాంతి తప్ప సంపూర్ణ చికిత్స అనేది లేదు.
సైయాటికా ఆయుర్వేదంలో గృధ్రశీ వాతం అంటారు. వాతమంటే మన కదలికలకి కారణమైన నరాల శక్తి. అది గృధ్రశ్రీ నరాన్ని దెబ్బతీస్తే దాని వల్ల వచ్చే నొప్పి కనుక గృధ్రశీ వాతమంటారు. నాటి శాస్త్రజ్ఞులు శరీరాన్ని నడిపించే మూడు శక్తుల కారణంగా శరీరం, మనస్సు, ఆత్మ ఏ బాధా లేకుండా ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యమని, అందులో ఏ శక్తికైనా మార్పులొస్తే వ్యాధి అని అంటారు. అలాగే ఎక్కువా ఎండిపోయిన నిలువ ఉన్న ఆహారం తినటవ వల్ల, ఎక్కువగా ఇష్టం వచ్చినట్లు చరించడం వల్ల మానసికంగా ఎప్పుడూ చింతిస్తూ ఉండటం వల్ల, దెబ్బలు తగలడం వల్ల ఈ గృధ్రశీ నరం పాడై విపరీతమయిన నొప్పి, తిమ్మిరి ఎక్కడం, గట్టిగా నొక్కి పట్టుకుంటే కాస్త తగ్గినట్లుండటం వంటివి కనిపిస్తాయి.
సాధారణంగా నొప్పి నడుం చివర భాగంలో ఆరంభమై తొడల లోపలి భాగంలోకి ప్రాకి మోకాళ్ల కిందకి జారి పిక్కలకు చేరి మొత్తం కాలుతో ఆరంభమై విపరీతంగా లాగినట్లు బాధ ఉంటుంది. కాళ్లు కదపడం కూడా కష్టం అవ్ఞతుంది. మొత్తానికి ఈ నొప్పి తిమ్మిరితో కూడి సూదులు పొడిచినట్లు ఉండి ఒక్కొక్కప్పుడు కళ్లలో నీళ్లు వస్తాయి. నిజానికి ఎటువైపు ఉంచినా నొప్పి తగ్గినట్లు అనిపించదు. దీని నివారణ ఆయుర్వేదంలో రెండు రకాలుగా చెప్పబడింది. ఒకటి – కారణాన్ని సరిచేయడం, రెండవది వచ్చిన స్థితిని క్రమపరచడం. మొదట శరీరం అంతా నువ్వుల నూనెతో కాని ధన్వంతరీ తైలంతో గాని ముఖ్యంగా నడుం నుంచి కిందకీ బాగా రాసి సున్నితంగా మర్దన చేసిన తర్వాత చెమట పట్టేటట్లు స్వేదన క్రియ చేసి లోపల దోషాలని బయటకు పంపాలి. అలాగే వారానికి ఒక్కసారి ఎనిమా చేసుకోవడం కూడా అవసరం.
దీన్ని ఆయుర్వేద చికిత్సలలో వస్తి అంటారు. సాధారణంగా మాంసరసం, ఉసిరిక రసం చాలా ఉపయుక్తంగా ఉంటాయి. వెల్లుల్లి, నిర్గుండి, త్రిఫల చూర్ణం, రాస్నా వంటివి ఉపయుక్తంగా ఉంటాయి. త్రయోదశాంగ గుగ్గులు, వాతగజంకుశరసం, బృహత్‌వాత చింతామణి, రాస్నాది కషాయం, యేరండస్నేహం వంటివి చక్కటి మందులు. నీరుల్లిపాయల రసం, ఆవనూనె సమభాగాలుగా తీసుకుని కలిపి పైన మర్దన చేసుకుంటే చాలా శాంతిగా ఉంటుంది. నీరుల్లిపాయ రసం, అల్లపురసం, తేనె సమభాగాలుగా తీసుకుని పూటకు రెండు చెమ్చాల చొప్పున తీసుకుంటే నొప్పి తగ్గుతుంది.
ఈ వాత వ్యాధులలో మనం ఆవాతాన్ని అంటే ఆ నరంలో మారిన శక్తిని సమపరిచే ఆహారం తీసుకుంటే తొందరగా మందు పనిచేసి తగ్గుతుంది. అలాగే ఆ వ్యాధిని పెంచే పదార్థాలు తినకుడా ఉంటే వ్యాధి తొందరగా తగ్గుతుంది. బూడిదగుమ్మడికాయ, మినుములు, వంకాయ, ములగకాయ, కాకరాకాయ, చక్రవర్తి కూర, నల్ల ఉలవలు, గోధుమలు, చేమ, పొట్ల,ముల్లంగి, జీలకర్ర, ఇంగువ, కంద వేడినీళ్లతో అభ్యంగనస్నానం పథ్యము, అలాగే చల్లటి నీళ్లు, దోసకాయ, ఆనపకాయ, సొరకాయ, పెసలు, అమము, ఆవాలు, వేపపండ్లు, కొత్తధాన్యం, ఉపవాసం, బీరకాయ, చల్లటి ప్రదేశాలకు వెళ్లడం అపథ్యము. విషయిష్ట తైలం, బలాతైలం, క్షారబలాతైలం, బలాశృగంధతైలం, ధన్వంతరీ తైలం, కర్పూరతైలం, వీటిలో ఏదైనా సాయంత్రం మర్దన చేసుకుని వేన్నీళ్లతో స్నానం చేయడం హితకరం. విడంగాసవం ఉదయం, సాయంత్రం మూడు చెమ్చాలు మందు, మూడు చెమ్చాల నీరు కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న క్రిములన్నీ వెళ్లిపోతాయి. అల్లం 50 గ్రాములు, పంచదార 50 గ్రాములు కలిపి నూరి రోజూ రెండు సార్లు గోరువెచ్చటి నీళ్లతో తీసుకుంటే చాలా హితకరం. వేరుశెనగనూనె, తీపి పదార్థాలు, వేడి చేయని
సయాటికా నొప్పి కోసం సహజ చికిత్సలు
ఈ రోజుల్లో 40 శాతం ప్రజలు సయాటికా నొప్పి తో బాధ పడుతున్నారు. తుంటి అనగా తొడ వెనుక భాగపు నరముల వాపు ద్వారా ఒత్తిడి కలిగినపుడు లేదా భౌతికంగా హాని కలిగినప్పుడు తుంటి నొప్పి ఏర్పడుతుంది. తుంటి నొప్పి కి అనేక కారణాలలో:
• ఉబ్బడం లేదా హెర్నియేటెడ్ డిస్క్
• వెన్నెముక కాలమ్ సన్నబడుట
• పరిసర ప్రాంతాల మృదు కణజాలంలో (soft tissues) వాపు
• పొట్టైన లేదా పిరుదుల లో పిఫార్మిస్ కండరాల సంకోచం (Piriformis syndrome)
తుంటి నొప్పి సాధారణంగా సన్నని పోటు తో కూడి ఉంటుంది; పదునైన బర్నింగ్ సంచలనాన్ని; లేదా పిరుదులు వెనుక లేదా తొడకు తీవ్ర అసౌకర్యం, తిమ్మిరి, బలహీనత, మరియు జలదరించటం లక్షణములుగా ఉండవచ్చు.
1. వేడి లేదా చల్లని సంపీడనం (Compression)
వేడి లేదా చల్లని సంపీడనం ఉపయోగించి తుంటి నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం పొందవచ్చు. తుంటి అనగా తొడ వెనుక భాగపు నరములలో సంపీడనం (Compression) ఉండవచ్చు, వేడి చికిత్స బిగిసిన కండరాల ను సడలించి ఉపశమనమిస్తుంది. శీతల చికిత్స వలన నరాల చుట్టూ వాపు, నొప్పి, తిమ్మిరి తగ్గుతుంది.
ఒక దాని తరువాత ఒకటి గా వేడి సంపీడనం (compress) ప్రక్రియ తో ప్రారంభించి చల్లని ఒత్తిడి తో ఆపాలి. వేడి ఒత్తిడి ఉపయోగిస్తున్నప్పుడు, ఒక ఆవిరి పట్టిన టవల్ ఉపయోగించడం మరింత సమర్థవంతమైన పద్ధతి.
15 నుండి 20 నిమిషాలు ప్రభావిత ప్రాంతం మీద వేడి తరువాత చల్లని ప్యాక్ ఉంచండి.
మీకు ఉపశమనం వచ్చేవరకు ఈ ప్రక్రియ కొన్ని గంటల చేయండి.
గమనిక: మీకు ప్రసరణ సమస్యలు ఉంటే చల్లని సంపీడనం వాడకండి.
2. పసుపు
పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తుంటి నొప్పి కోసం మరొక సమర్థవంతమైన సహజ నివారణ మార్గంగా చెప్పవచ్చు. ఇది curcumin అనే సమ్మేళనం కలిగి నరాల నొప్పి మరియు వాపు తగ్గించేందుకు సహాయపడుతుంది.
• 1 కప్పు పాలలో, 1 టీస్పూను పసుపు జోడించండి. రెండంగుళాల దాల్చిన ముక్క కూడా జోడించవచ్చు. విటన్నిటిని కలిపి మరిగించండి, చల్లార్చి వడబోయండి. ఈ ఆరోగ్యకరమైన పానీయానికి కొంచెం తేనె తో కలిపి మరియు ప్రతిదినమూ ఒకసారి లేదా రెండుసార్లు తాగాలి. మీరు అభివృద్ధి కనిపించే వరకూ ఈ ప్రక్రియ పునరావృతం చేయండి. ప్రత్యామ్నాయాలు
• మరొక ఎంపికగా ఒక రోజుకు 250 నుంచి 500 mg, పసుపు ప్రత్యామ్నాయాలు (supplements) 3 సార్లు అనేక వారాలు సేవించాలి. ఈ వివషయంలో మీ వైద్యుడను సంప్రదించండి.
గమనిక: పసుపు రక్తాన్ని పలచబరచే మందులు వాడుతున్న వారు, మధుమేహం (Diabetis) ఉన్నవారు మరియు పిత్తాశయం లో రాళ్ళ సమస్యలున్న వారు తీసుకోరాదు. వారికి నిషిద్ధమని గమనించాలి.
3. మసాజ్
మసాజ్ థెరపీ తుంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా సమస్య కండరాల అనియంత్రిత వ్యాకోచం వల్ల (muscle spasm) కలిగితే కూడా నయం చేయటంలో సహాయం అందిస్తుంది. అంతే కాకుండా, అది ఉద్రిక్తతను విడుదల చేయడంలో, పంపిణీ ఉద్దీపన కావించడంలో మరియు కదలిక శ్రేణి పెంచడంలో, సహాయపడుతుంది.
• సెయింట్ జాన్ వోర్ట్ నూనె వ్యతిరేక వాపు నిరోధక గుణాలను కలిగి ఉంది. తుంటి నొప్పి మరియు వాపు నుండి ఉపశమనానికి సహాయపడుతుంది. మీరు ఉపశమనం పొందే వరకు రోజూ సెయింట్ జాన్ వోర్ట్ నూనె 2 లేదా 3 సార్లు బాధిత ప్రాంతం మసాజ్ చేయండి.
• మరొక ఎంపికగా 1 కప్పు నువ్వులు నూనెకు 3 టేబుల్ స్పూనుల జాజికాయ పొడిని జోడించండి. మిశ్రమం వేడి చేయండి. ఇది గోరు వెచ్చగా చల్లారిన తరువాత ప్రభావిత ప్రాంతంలో మసాజ్ చేయండి. రోజుకు 2 - 3 సార్లు కొన్ని వారాల వరకు పునరావృతం చేయండి.
• వీపు కింది భాగం లో, పిరుదులు మరియు తొడల కు ఇరు వైపులా కలిగే నొప్పి కి తరచుగా పిరుదులు (gluteus) వెన్నముక మధ్య (medius) మరియు చిరు కండరములు (minimus muscles) లో ఉన్న ట్రిగ్గర్ పాయింట్ల తో సంబంధం కలిగి ఉంటుంది. అందువలన రోజువారీ కనీసం ఒకసారి ట్రిగ్గర్ పాయింట్ మర్దన చికిత్స చేయవచ్చు.
గర్భవతులకు ఈ చికిత్స నిషిద్ధమని గమనించాలి.
4. వ్యాయామం
సాధారణ కార్యకలాపాలు మానకుండా నిర్వహించడం తుంటి నొప్పి నివారణకు అత్యంత లాభదాయకం. తుంటి నొప్పి వచ్చిన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత, మీరు ఉదర మరియు వీపు కండరాలు బలోపేతం చేయడానికి ఒక సాధారణ వ్యాయామాల కార్యక్రమం మొదలు పెట్టవచ్చు. కోర్ కండరాల ను పటిష్టం చేయటం ద్వారా త్వరిత రికవరీ సులభతరం అవుతుంది.
ఈ విషయం లో కింది లింకు లోని వ్యాయామ ప్రదర్శన చూడండి;
https://www.facebook.com/top10homeremedies/videos/630585553755259/
తుంటి నొప్పి తగ్గించేందుకు, వీపు క్రింద భాగపు ఫ్లెక్సిబిలిటీ మెరుగుపరచడానికి మోకాలు-ఛాతీ స్ట్రెచప్సు చేయవచ్చు.
ఒక చాప మీద వెల్లకిలా పడుకోండి (ఛాతీ ఆకాశం వైపుగా) మీ కాళ్ళను నేరుగా చాపండి తరువాత కాళ్ళు దూరంగా జరపండి (V Shape). మీ శరీర పైభాగం రిలాక్స్డ్ గా ఉంచండి. మెల్లగా శ్వాస లోనికి తీసుకుంటూ, మీ కుడి మోకాలు బెండ్ చేయండి. మీ రెండు చేతులు తోడ చుట్టూ బిగించి మెల్లిగా వీలు, సౌకర్యం (బాధ, నొప్పి కలగనంతవరకు) ఉన్నంత వరకు మీ ఛాతి వైపుకు లాగండి.
ఎడమ కాలు ఉపరితలంపై ఫ్లాట్ గా ఉంచండి.
నియంత్రిత గాఢ శ్వాసలతో 20 సెకన్లు ఈ స్థానంలో పట్టుకోండి అప్పుడు శాంతముగా మీ కాలును నెమ్మదిగా క్రిందికి దించి చాపండి.
3 నుంచి 5 సార్లు రిపీట్ చేసి ఆపై ఎడమకాలుతో ఈ ప్రక్రియ పునరావృతం చేయండి.
రెండు కాళ్లతోనూ 3 లేదా 5 రెట్లు సార్లు ఈ వ్యాయామం చేయండి.
మీరు స్పైనలు రోలింగు, మోకాలు రాకింగ్, ఫ్లోర్ మలుపులను, బ్యాక్ బ్లాక్, బ్యాక్ ఎక్టెన్షనులు, సయాటికా మొబ్లైజింగు స్ట్రెచ్చెసులు మరియు కొన్ని యోగా భంగిమలలో పావురం, పిల్లి-ఆవు, వంటి వ్యాయామాలు చేయవచ్చు. మీరు అలాగే వెన్నెముక ఒత్తిడి తగ్గించే వ్యాయామాలు ప్రయత్నించవచ్చు.
గమనిక: సరియైన వ్యాయామ కార్యక్రమం ఎంపిక, అమలు సహాయం కోసం మీ యోగా గురవులను సంప్రదించండి.
5. క్యాప్సైసిన్ క్రీమ్
కారపు పొడి క్యాప్సైసిన్ కలిగి, సాధారణ బాధ నివారిణి గా పనిచేసే చురుకైన పదార్ధం. ఇది నొప్పి సంకేతాల ను రవాణా చేసే న్యూరోట్రాన్స్మిటర్, లోని “పి” అనే పదార్ధం స్థాయిల క్షీణత కు సహాయపడుతుంది.
0.025% నుండి 0,075% వరకు కలిగిన క్యాప్సైసిన్ క్రీమ్ లేదా లేపనం కనీసం 1 వారం రోజులు, ప్రభావిత ప్రాంతం లో రోజుకు 4 సార్లు వరకు రాయండి.
గమనిక: క్యాప్సైసిన్ క్రీమ్ లేదా లేపనం ప్రారంభం లో మంట కలిగించవచ్చు. ముఖ్యంగా పగిలిన చర్మంపై రాయవద్దు.
6. తగర జఠామాంసి (Valerian)
తగర జఠామాంసి వేరు కండరాల ను సడలించి, దీర్ఘకాలిక నరాల నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది కండరముల ఆకస్మిక చైతన్యము (Spasm) వలన వచ్చిన తుంటి నొప్పిని ఉపశమనానికి మంచి ఔషధం. ఈ మూలిక శీఘ్రంగా ఆవిరయ్యే నూనెలు కలిగి, కండరాలకు విశ్రాంతి మరియు ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రముఖంగా, నిద్రలేమి చికిత్స కూడా ఉపయోగిస్తారు.
150 మి. గ్రా తగర జఠామాంసి వేరు ప్రత్యామ్నాయలు (supplements) రోజుకు 3 సార్లు కొన్ని వారాలు వాడాలి, కానీ ఈ విషయంలో ప్రధమంగా మీ వైద్యుడను సంప్రదించండం చాలా అవసరం.
మరో ఎంపిగా ఎండిన తగర జఠామాంసి వేరు పొడి, 1 కప్పు నీటి లో వేసి 10 నిమిషాలు మరిగించి, గోరు వెచ్చగా చల్లారిన టీ రోజులో 1-2 సార్లు, కొన్ని వారాల పాటు సేవించండి. కానీ ఈ విషయంలో ప్రధమంగా మీ వైద్యుడను సంప్రదించండం చాలా అవసరం
7. వైట్ విల్లో బెరడు (తెలుగు పేరు దొరక లేదు)
వైట్ విల్లో బెరడు కూడా దీర్ఘకాల శాశ్వత నొప్పి ఉపశమనం కోసం ఉపయోగించవచ్చును. ఇది యాంటీ-ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జేసిక్ ప్రయోజనాలు అందిస్తుంది, సాలిసిన్ తో ఫినోలిక్ గ్లైకోసైడ్ కలిగి ఉంది.
రోజువారీ 120 - 240 మి. గ్రా అనేక వారాల కోసం సాలిసిన్ తెలుపు విల్లో బెరడు ప్రత్యామ్నాయాలు (supplements) తీసుకోండి. కానీ ఈ విషయంలో ప్రధమంగా మీ వైద్యుడను సంప్రదించండం చాలా అవసరం.
8. మెంతులు
వ్యతిరేక-శోథ ప్రయోజనాలు గల మెంతుల నుండి తయారు చేసిన పిండికట్టు తుంటి నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు గౌట్ నొప్పులను కూడా నివారిస్తుంది.
• పిడికెడు మెంతులు గ్రైండ్ చేయండి.
• ఒక మెత్తటి పేస్ట్ పొందుటకు తగినన్ని పాల తో పొడి కలిపి మరిగించండి.
• బాధాకర ప్రాంతం లో ఈ పిండికట్టు కట్టండి.
• 4-5 గంటలు ఆగి శుభ్రంగా కడగండి.
• మీరు ఉపశమనం పొందే వరకు ప్రతి రోజూ పునరావృతం చేయండి.
9. ఆక్యుపంక్చర్ మరియు ఆక్యుప్రెజర్
ఆక్యుపంక్చర్ తత్సంభంధమైన శిక్షణ పొందిన నిపుణుడు మాత్రమే చెయ్యాలి. ఈ పద్దతి వలన తప్పక ఉపశమనం లభిస్తుంది.
ఆక్యుప్రెజర్:
ఆక్యుప్రెషర్, కండరముల ఉద్రిక్తత సడలింపు స్థితిలో నొప్పి కి ఉపశమనాన్ని మరియు ట్రిగ్గర్ పాయింట్ల వ్యవస్థ ఉపయోగించి శరీరంలోని కీలక జీవన శక్తిని సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఎండార్ఫిన్లు అనే నాడీ రసాయనాల విడుదల ను ఉత్తేజితం చేసే పాదాల పైన రెండు ఆక్యుప్రెజెర్ పాయింట్ల ఒత్తిడి ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చిన బొమ్మలో చూడండి.
ఎండార్ఫిన్ల విధానం, మార్ఫిన్ ప్రక్రియ తో సమానంగా ఉంటుంది; రెండు నొప్పి తగ్గించడానికి మరియు సడలింపు కు ప్రోత్సహిస్తాయి. అయితే, ఎండార్ఫిన్లు శరీరం లో సహజంగా తయారవుతాయి. ఆక్యుప్రెషర్ పాయింట్లు ఎల్ వి 3 మరియు జీబి 41 శరీరం లో దాని సొంత సహజ మందుల ఉద్దీపన ఉత్పత్తికి తోడ్పడి, నొప్పికి ఉపశమనం ఇస్తుంది.
ఎల్వీ 3, పాదాల మీద ఉన్న 1 వ మరియు 2 వ metatarsal ఎముకల మధ్య గాడి లోనూ,
GB 41 పాదాల మీద ఉన్న 4 వ మరియు 5 వ metatarsal ఎముకల మధ్య గాడి లోనూ ఉన్నాయి.
ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ల మీద మీ చూపుడు వేలితో పాదాల మీద క్రమంగా ఎముకలు మధ్య లో 2 నిమిషాలు గట్టిగా వత్తుతూ గాఢంగా శ్వాస తీసుకోండి ఆ సమయంలో బాగా బాధపెడుతుంది. మీ కాలు, పాదం, తుంటి నొప్పి మరియు తిమ్మిరి ఉపశమనం కలుగుతుంది. మరో పద్ధతి గా ఈ పాయింట్లను మీ చూపుడు వేలితో వర్తులాకారంగా తిప్పతూ ఒత్తిడి ఇవ్వవచ్చును. ఈ రెండిటిలో మీకు అనుకూలమైనది ఎంపిక చేయండి. ఈ ప్రక్రియ ఎవరికి వారే చేసుకొన వచ్చును. ఒకసారి 5 చుట్లు (వర్తులాలు) కన్నా ఎక్కువ చేయరాదు. రోజూ 2 సార్లు చేయండి.
10. యోగా
యోగా తుంటి నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు సమర్థవంతమైన సాధన కాదు. యోగా, కండరాల వశ్యత (flexibility) ను బలోపేతం చేయలేదు. అంతేకాక, ఆన్లైన్ నివేదికలు కూడా యోగ సాధన భంగిమలు తుంటి నరముల సమస్యను మరింత తీవ్రం చేస్తుందని తెలిపాయి.
11. నిద్ర
నరాలకు సంబంధించిన అనారోగ్య నివారణ ముఖ్య అంశాలలో విశ్రాంతి ఒకటి. అందువలన, మంచి నిద్ర ఎల్లప్పుడూ మీ శరీరమునకు తగిన నివారణ, విశ్రాంతి, మరియు సమతుల్యత ను ఇస్తుంది. కాబట్టి నిద్ర మరియు విశ్రాంతి మీ నరముల పునరుత్పత్తి మరియు వాటిని బలోపేతం చేయడానికి సహాయం చేస్తాయి.
12. వెన్నుముక అభిసంధానం (Spinal Manipulation)
చిరోప్రాక్టిక్ రక్షణ మెడ మరియు నడుము నొప్పి కోసం ఒక మంచి ప్రజాదరణ పొందిన సహజ చికిత్స. చిరోప్రాక్టిక్ స్పైనల్ అభిసంధానం నరాల చిరాకు, మంట మరియు తుంటి సంబంధమైన ఇతర లక్షణాలను వేగంగా తగ్గించడానికి, చిన్న ఒత్తుడులు కలిగిన వివిధ పద్ధతులు ఉన్నాయి.
మీ తుంటి నొప్పి కి ఖచ్చితమైన కారణాన్ని బట్టి, సరైన చికిత్స చిరోప్రాక్టిక్ ద్వారా లభిస్తుంది, తత్సంబంధ నిపుణులను, మీ డాక్టరును సంప్రదించండి.
అదనపు చిట్కాలు
• ఆకస్మిక కదలికలు చేయరాదు.
• మీ నడుము క్రింద భాగం ఒత్తిడి లోనుగాకుండా మంచి భంగిమ లో కూర్చొనుట, నుంచొనుట చేయాలి.
• లేవటానికి మీ వెన్ను నేరుగా మరియు మోకాలు వంగేలా సరైన పద్ధతులు పాటించాలి.
• మీ పరుపు ఎక్కువ మెత్తగానూ, ఎక్కువ గట్టిగానూ ఉండరాదు.
• సాధారణ వ్యాయామం చెయ్యవచ్చు, కానీ తీవ్రమైన వ్యాయామం చేయరాదు.
• డిస్క్ క్షీణత ప్రోత్సహించే ధూమపానం మానండి.
• మూలికా పరిహారం తీసుకునే ముందు, అనుకూలమైన మోతాదు కోసం మీ డాక్టర్ సంప్రదించండి.
• మీ వైద్యుడును సంప్రదించిన తర్వాత విటమిన్-సి, కాల్షియం మరియు మెగ్నిషియం తీసుకొనండి.
When the cause of sciatica is due to a prolapsed or lumbar disc herniation 90% of disc prolapses will be resolved with no intervention. Treatment of the underlying cause of the compression is needed in cases of epidural abscess, epidural tumors, and cauda equina syndrome.
Cases of sciatica are treated with different measures. Evidence of the effectiveness of these measures is limited, however. Some of these measures are:
* Anti-inflammatory medications (e.g., NSAIDs or oral steroids. However, NSAIDs are no more effective than placebos for acute sciatica)
* Paracetamol (acetaminophen): limited evidence of effectiveness
* Narcotics: often used if pain is severe
* Physical therapy / Stretching exercises
* Epidural steroid injections provide no long-term improvements in outcomes but do provide some short-term benefits
* Non-surgical spinal decompression
* Massage therapy
* Ultrasound
* Weight loss reduces pressure on Spinal nerve roots
* Acupuncture
Surgery
Surgery speeds the resolution of pain. Two years after surgery, however, surgical and non-surgical management have about the same results; so a patient's preference can be a valid reason to choose one or the other.
Prevention
Exercise like walking or swimming strengthen the muscles that support the back without putting any strain on it or subjecting it to a sudden jolt, and can prevent and reduce the symptoms of sciatica. Yoga or pilates can help improve the flexibility and the strength of the back muscles.
Bad posture can aggravate sciatica. Taking measures to improve it can alleviate pain and swelling:
Standing
Stand upright with a straight back and front-facing head. Weight should be balanced evenly on both feet and legs kept straight.
Sitting
Sit upright with a support, such as a cushion or rolled-up towel in the small of the back. Knees and hips should be level and feet should be flat on the floor, with the aid of a footstool if necessary.
Driving
As with sitting, the back should be properly supported. Correctly position wing mirrors to prevent having to twist the back. Foot controls should be squarely in front of the feet. If driving long distances, regular breaks should be taken to stretch legs.
Sleeping
Sleep on a medium-firm mattress (not too firm). The mattress should be firm enough to support the body while supporting the weight of the shoulders and buttocks, keeping the spine straight. Support the head with a pillow, but make sure the neck is not forced up at a steep angle.
Lifting and handling
To prevent injury-caused sciatica, the correct method for lifting and handling objects should be followe
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి