పిల్లలలో ఆకలిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన ఆహార పదార్థాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
నెలల చంటిపిల్లల నుండి వయసు పెరిగే కొద్దీ పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని తినిపించాలి? ఎటువంటి ఆహారాన్ని పిల్లలు ఇష్టపడతారు? పిల్లలలో ఆకలిని పెంచే ఆహార పదార్థాల గురించి కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లితండ్రులకు వచ్చే ప్రశ్నలు. ఐతే కొందరు పిల్లలు మాత్రం వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తున్నా సరే తినడానికి ఇష్టపడరు. అందుకని ఇక్కడ పిల్లల ఆకలిని పెంచే ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..
చిరు తిండ్లు
నెలల బాబు/పాపకు తల్లి పాలు మంచిదని అందరికీ తెలిసిందే. సంవత్సరం లేదా రెండేళ్లు నిండిన పిల్లలు ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు. అయితే చిరు తిండి తినడానికి మాత్రం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ముందుగా చిరుతిండికి వారిని దూరం పెట్టడం వలన సరైన ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతారు.
పండ్ల రసాలు
పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ తల్లిపాలను వీలైనంత వరకు తగ్గించి వారికి ఆకలిని పెంచే ఆహార పదార్థాలపై దృష్టిని మళ్లించాలి.
అందుకని ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లను డైరెక్ట్ గా కాకుండా వాటికి నీరు, పాలు, వెన్న కలిపి ఇవ్వడం వలన ఇష్టంగా తింటారు. ఫ్రూట్ జ్యూస్ లను ఇష్టపడని పిల్లలకు ఆపిల్, బనానా, జామ, సపోటా పండ్లను చిన్న చిన్న ముక్కలుగా అందంగా కోసి ఇస్తే ఇష్టంగా తింటారు.
పోషక పదార్థాలు
చాలామంది తల్లితండ్రులు పిల్లలకు పోషకాహార పదార్థాలను తినిపించాలని తెలుసు కానీ ఆ పోషక పదార్థాలు అంటే మాత్రం తెలియదు. వాల్ నట్స్, డ్రై ఫ్రూట్స్, ఎగ్, వెన్న రాసిన చపాతీలు, బాదం పప్పు, నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు పిల్లలకు ఆకలి వేయడానికే కాకుండా మంచి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
బలవంతం చేయకండి
పిల్లలైనా పెద్దలైనా సరే ఆకలి వేసినప్పుడే తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా పిల్లలకు ఒకే సమయానికి తినాలి అని బలవంతంగా ఆకలి కలుగకున్నా తినిపించడం వలన వారు ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి బలవంతం చేయకూడదు. పెద్దలు తింటున్నప్పుడు లేదా వేరే వాళ్ళు తింటున్నప్పుడు ఆకలికి మారాం చేస్తుంటారు కాబట్టి అటువంటి సమయాలలోనే తినిపించడం చేయాలి.
ఆకలిని పెంచడానికి
పిల్లలకు వికారం వాంతుల కారణంగా ఆకలి కలగకపోవడానికి ఒక కారణం కాబట్టి ఆకలిని పెంచడానికి ఇసి బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక పావు కిలో బియ్యం, ఇరవై గ్రాముల శొంఠి మరియు రెండు గ్రాముల మిరియాలు తీసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బాక్స్ లో దీన్ని నిల్వ ఉంచుకోవాలి. దీనిని ప్రతిరోజూ ఒక స్పూన్ ఒక గ్లాస్ నీటిలో కలిపి ముద్దలుగా అయ్యేలా ఉడికించాలి. దీనికి కాస్త ఆవు నెయ్యి కలిపి ముద్దలుగా చేసుకోవాలి. ఐతే కొందరు పిల్లలు తియ్యగా ఉంటే తింటారు కాబటి వారికి పటికబెల్లం కలిపి పెట్టవచ్చు, అలా ఇష్టపడని వారికి కొద్దిగా సాల్ట్ కలిపి తినిపిస్తే ఆకలి పెరుగుతుంది.
అరటిపండు
ఆకలి మందగించిన పిల్లలకు అరటిపండును బాగా గుజ్జుగా చేసుకుని తినపించవచ్చు లేదా అందులో కాస్త పాలు, కొంచెం చక్కర కలిపి తినిపించిన ఎంతో ఇష్టంగా తింటారు.
జీర్ణం అయ్యే ఆహారం
పిల్లలకు ఎప్పుడైనా త్వరగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తినిపించాలి. లేకపోతే కడుపునొప్పి, వాంతులు, వికారం సమస్యలు తలెత్తుతాయి. నూనె, మసాలా పదార్థాలను కొన్ని రోజుల వరకు దూరంగా ఉంచడమే మంచి
పిల్లలకు ఆకలి వేయకపోవడానికి గల కారణం
దాదాపు ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తన పిల్లల గురించి చెప్పే మొదటి కంప్లయింట్ “తిండి సరిగా తినట్లేదు” అని. ఇది కేవలం కంప్లయింట్ కాదు, చాలా ఇళ్ళల్లో పిల్లలు ఇలానే ఉంటున్నారు. పిల్లలు ఆటలకే పరిమితం అవుతారు తప్ప తిండి మీద ధ్యాస పెట్టరు. కొందరికైతే అస్సలు ఆకలి వేయదు. మరి అలాంటి చిన్నారుల విషయంలో ఏం చేయాలో తెలుసా! వారికి ఆకలి ఎందుకు వేయట్లేదు ? దీని వెనుక ఒకటి రెండు కాదు, చాలా కారణాలే ఉన్నాయి. మీ పిల్లలు ఏ కారణంతో సరిగా తినట్లేదో ఇప్పుడు తెలుసుకోండి.
- ఆకలి పెంచే క్రమంలో ఉదయాన్నే తీసుకునే అల్పాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. ముఖ్యంగా తృణధాన్యాలూ, పెరుగూ, పండ్ల వంటి వాటితో చేసిన వివిధ పదార్థాలను ఎంచుకొని వారికి అందించండి. ఇవి శరీరానికి తగిన పోషకాలను అందిస్తూనే క్రమంగా ఆకలిని పెంచుతాయి.
- వాళ్లకు ఎప్పుడు పెట్టే ఆహారమే రోజూ పెడుతూ ఉంటే కూడా తిండి మీద ధ్యాస తగ్గుతుంది. కాబట్టి ఆసక్తికరమైన వంటకాలు చేస్తూ ఉండాలి. నూనె ఎక్కువగా వాడిన ఆహరం పెట్టవద్దు. ఫ్యాట్స్ ఎక్కువగా శరీరంలో పడ్డాక, మరో పూట ఆకలి సరిగా వేయదు.
- చిన్నారులకు ఆహారాన్ని అందించే వేళల్ని క్రమబద్ధం చేసుకోండి. మీ పని పూర్తవడాన్ని బట్టో లేక ఓ పనైపోతుందనో భావించి చేయొద్దు. ఇలాంటప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టేయడం వల్ల వారికి అన్నం తినడం మీద ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది. జీర్ణశక్తీ మందగిస్తుంది. అందుకే విసుగనుకోకుండా కొద్దికొద్దిగా అన్నం తినేలా చూడండి.
- పిల్లలు సాయంత్రం సమయంలో కనీసం ఒక గంట ఆరుబయట ఆడుకునేలా చూడాలి. కుదిరితే మీతో పాటూ వ్యాయామానికీ తీసుకెళ్లాలి. దానివల్ల ఆకలిని పెంచే హార్మోన్లు సమతుల్యమవుతాయి. బాగా ఆకలీ వేస్తుంది.
- చిరుతిండిని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. కచ్చితంగా ఫలానాదే తినాలి… అంటూ నియమ నిబంధనలు విధించొద్దు. వారి ఇష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్ తయారు చేయండి. రోజూ చేయాలంటే ఇబ్బంది కాబట్టి వారానికోసారి చేసి నిల్వ చేయండి.
- కొందమంది పిల్లలు బయటకి ఎక్కువగా వెళ్ళరు. ఇంట్లోనే టీవి, కంప్యుటర్, స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చుంటారు. ఇలాంటి పిల్లలకు క్యాలరీలు ఎక్కువగా ఖర్చు కావు కాబట్టి ఆకలి కూడా ఎక్కువగా వేయదు. కాబట్టి పిల్లలు బయటకి వెళ్ళి ఆటలు ఆడకునేలా ప్రోత్సహించండి.
- అరటి పండ్లూ, నట్స్, చీజ్, పాప్‌కార్న్ వంటివి ఎదిగే పిల్లలకు అవసరం. అలా అని స్నాక్స్ భోజనానికి ప్రత్యామ్నాయం కాదు. ఎదిగే పిల్లలకు కార్బోహైడ్రేట్లూ, పీచూ తగిన మోతాదులో అవసరం. చిన్న పిల్లలకి ఆహారాన్ని వీలైనంత వరకూ వేడిగా ఉన్నప్పుడే తినిపించే ప్రయత్నం చేయండి. దీనివల్ల త్వరగా జీర్ణమవుతుంది. తిరిగి ఆకలి వేస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి