1, జులై 2020, బుధవారం

స్పెర్మ్ కణాలు పెరగాలి అంటే తీసుకో వలిసిన ఆహారం నవీన్ డైట్ ప్లాన్

How To Increase Sperm Count In Telugu

మగవారిలో వీర్యకణాల లెక్క బాగా తక్కువగా ఉంటే, సంతానం కలగటం కష్టం అవ్వవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ప్రకారం వీర్యకణాల లెక్క (sperm count) ఒక మిల్లి లీటర్ కి 15 మిలియన్లు (15 million per milliliter) ఉంటే, మంచి ఆరోగ్యాంగా ఉన్నట్టే. అంతకంటే తక్కువగా వుంటే, సమస్యలు తలెత్తవచ్ఛు (1).

వీర్యం ఎక్కువగా ఉన్నా, పనికివచ్చే కణాలు, చురుకైన కణాలు లేకపోతే కూడా సంతానోత్పత్తి లో సమస్యలు కలుగవచ్చు. మీరు వీర్యకణాల పరీక్ష చేయించుకుని, అందులో కౌంట్ కానీ నాణ్యత కానీ తక్కువ అని వస్తే గనుక, మీ వైద్యులు మీకు చికిత్స మొదలు పెడతారు. ఆ చికిత్సతో పాటుగా మీరు తీసుకునే ఆహరం మీద కూడా ధ్యాస పెడితే ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.

మగవారి వీర్యకణవృద్ధి కోసం సహజమైన ఆహార చిట్కాలని ఇక్కడ మామ్ జంక్షన్ వివరిస్తోంది.

వీర్యకణాలు (స్పర్మ్ కౌంట్) పెంచే చక్కని ఆహారం

మగవారి విషయంలో వీర్యకణాలు పెంచే మంచి పుష్టికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం గురించి తెలుసుకుందాం.

1. టోమాటోలు

టోమాటోల్లో లైకోపెన్ (lycopene) అనే యాంటీ-ఆక్సిడెంట్ (anti-oxidant) ఉంటుంది. వైజ్ఞానిక పరిశోధనలలో తెలిసినది ఏంటి అంటే టోమాటో జ్యూస్ వీర్యం ఆరోగ్యంగా, చురుకుగా ఉండేట్టు చెయ్యగలవు అని 

2. వాల్నట్స్ (అక్రోటు కాయ)

ఒమేగా 3, కొవ్వుతో కూడిన యాసిడ్స్ ఆక్రోట్ లో వున్నాయి. ఈ విషయంపై స్టడీ చేసిన వైజ్ఞానికులు ప్రతిరోజూ 70 గ్రాములు ఆక్రోట్ ఆహారంలో వుంటే వీర్యాన్ని బలంగా తయారుచెయ్యటంలో సహకరిస్తుంది అని కనుక్కున్నారు. 21 – 35 మధ్య వయసువాళ్ళు సలాడ్స్ లో పైన టాపింగ్ గా వీటిని వాడుకోవచ్చు. లేదా చిరుతిండి గా ఆక్రోట్ ని తినవచ్చు.

౩. గుమ్మడి కాయ గింజలు

స్పెర్ం కౌంట్ కి కావాల్సిన అమినో ఆసిడ్, ఫైటో స్టిరాల్స్ (phytosterols) గుమ్మడి గింజల్లో బాగా ఉన్నాయి. వీర్యం మోతాదు పెంచడానికి, వీర్య కణం నాణ్యతని పెంచడానికి ఇవి బాగా సహకరిస్తాయి (3). రోజూ వీటిని సలాడ్స్ మీద కానీ, ఉట్టిగా కానీ, పప్పుధాన్యాలతోనో తింటే మంచిది.

పప్పు దినుసుల్లో, బఠానీల్లో ఫోలిక్ ఆసిడ్ ఉంటుంది. అది వీర్య ఉత్పత్తికి, వీర్య వృద్ధికి, నాణ్యతకి ఉపయోగకరం  కాబట్టి వీటిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవాలి. అప్పుడు స్పెర్మ కౌంట్ ఆరోగ్యాంగా ఉండే అవకాశం ఉంటుంది.

5. బెర్రీస్

బ్ల్యూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, ఇలా ఎన్ని రకాల రేగిపళ్ళు దొరుకుతాయో, అవన్నీమంచివే. శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్స్, ఆంటీ-ఇంప్లమాటరీ (anti-inflammatory) లక్షణాలు స్పెర్ము కౌంట్ని పెంచవచ్చు  రోజుకో గుప్పెడు బెర్రీలు పెరుగులోనో, ఉట్టిగానో తింటే, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

6. దానిమ్మ పళ్ళు

దానిమ్మలో యాంటీ- ఆక్సిడెంట్స్ సంవృద్ధిగా ఉన్నాయి. టెస్టోస్టెరోన్ (మొగవారి సెక్స్ హార్మోన్) లెవెల్ పెంచి, స్పెర్మ్ ఆరోగ్యకరంగా తయారవడానికి, పురుషుల్లో సెక్స్ వాంఛని కలుగ చెయ్యడానికి దోహద పడుతుంది. ప్రయోగంగా ఎలుకలకి రోజూ ఇవి తినిపించి, 8 వారాలు పైగా పరీక్షించగా, దానిలోని వీర్య కణాల వృద్ధి స్పష్టంగా కనపడింది 

7. డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో అధికంగా ఎమినో ఆసిడ్ ల-ఆర్జినిన్ (amino acid L-arginine) ఉండటం వల్లన వీర్య కణాలు బాగా పెరుగుతాయి అని అంటారు. రోజుకో చిన్న ముక్క తింటేమంచిది (

8. వెల్లుల్లి

వెల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు పెద్దలు. వెల్లుల్లి లో ఎల్లిసిన్ (allicin) అనే పదార్ధంలో రక్త ప్రసరణని చురుకుగా చేయగల సత్తా ఉంది. రక్త ప్రసరణ బాగా ఉండటం వలన సంతానోత్పత్తి అంగాలలో ప్రక్రియలు బాగా జరిగి, వీర్యం ఎంతో ఆరోగ్యంగా తయారౌతుంది. వెల్లుల్లి లో సెలీనియం (selenium) ఉండటం, వలన వీర్య కణాల కదలికలు కూడా చురుకుగా ఉండే అవకాశం ఉంది 

9. కోడి గుడ్లు

గుడ్ల లో సంవృద్ధిగా ప్రోటీన్, విటమిన్ E ఉంటాయి. వీర్యకణాల నిర్మాణం, వాటి పెరుగుదల, నాణ్యతలని రక్షించడానికి అవి చాలా అవసరం 

10. క్యారెట్లు

క్యారెట్లలో బీటా-కారొటిన్ (beta-carotene) ఉంటుంది. అది బలమైన యాంటీ-ఆక్సిడెంట్, అరోగ్యకరమైన స్పెర్మ్ తయారవటానికి ఉపయోగ పడుతుంది. వీర్యకణాల కదలికలు, రూపం,మోతాదు పరిరక్షిస్తుంది. దానివల్ల వీర్యకణాలు అండం వద్దకు వెళ్లే వేగము కూడా పెరుగుతుంది 

11. అశ్వగంధ

అశ్వగంధ వేరు పురాతనంగా ఆయుర్వేద వైద్యంలో వాడేవారు. ఒక వైజ్ఞానిక ప్రయోగంలో, 66 మంది మగవారిలో టెస్టోస్టెరోన్ (testosterone) లెవెల్ పెరిగి, దానితో స్పెర్మ్ కౌంట్ కూడా బాగా పెరిగింది. అంగస్తంభన సమస్యలకి కూడా సమాధానం దొరికింది. అశ్వగంధ వేరుతో టీ చేసుకుని తాగావచ్చు 

12. ఆస్పరాగస్ (కాకపాలాకు) కూర

విటమిన్ బాగా ఎక్కువ శాతం వున్న ఈ ఆకుకూర వీర్య వృద్ధికి పని చేస్తుంది ). వీర్య కణాలు పెరిగాయంటే, అండాన్ని చేరడానికి పరుగుతీసే వీర్యకణాలు ఎక్కువౌతాయి. తద్వారా గర్భధారణ ఛాన్సులు పెరుగుతాయి.

13. అరటిపళ్ళు

అరటిపళ్ళల్లో బ్రోమిలీన్ అనే ఎంజెయిమ్ సెక్స్ హార్మోన్లని పెంచుతుంది. అంతే కాక, విటమిన్ A, B1, C మగవారిలో వీర్య వృద్ధికి, వీర్య శక్తి కి బలం చేకూరుస్తాయి.

14. పచ్చని ఆకు కూరలు

పచ్చని ఆకు కూరలలో ఫోలిక్ ఏసిడ్ బాగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ మగవారి శరీరం లో ఆరోగ్యకరమైన వీర్యం తయారవడానికి దోహద పడుతుంది. ఒక స్టడీ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, పాలకూర, బ్రోకలీ, పచ్చి బఠాణి, ముదురు పచ్చని ఆకుకూరలు రోజు తింటుంటే, మగవారిలో వీర్యకణాల సంఖ్య బాగా పెరుగుతుంది అని (

15. జింకు సంవృద్ధిగా ఉన్న పదార్ధాలు

జింకు ధాతువు స్పెర్మ్ కణాలను నాశనం కాకుండా రక్షించగలదు. జింక్ గల ఆహారం ప్రతి రోజు తీసుకోవటం మంచిది (

16. మెంతులు

అనాదిగా మగవారి వీర్య వృద్ధికి, అంగస్తంభనకు మెంతులు వాడేవారు. మెంతుల నుంచి తీసిన గాఢమైన పదార్ధాన్ని 12 వారాలు వాడితే, వీర్యం, వీర్యకణాల సంఖ్య బాగా పెరుగుతాయని ఒక స్టడీ తెలిపింది (17).

17. ఆలీవ్ నూనె

ప్రతిరోజు ఆలివ్ నూనె తాగితే, మగవారిలో వీర్యకణాలు, వీర్యానికి సంభందించిన రుగ్మతలు తగ్గుతాయి. చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఆక్సిజెన్ రక్తంలో బాగా ప్రవహించేలా చేస్తుంది. రక్తప్రసరణ చక్కగా ఉన్నప్పుడు మగవారిలో వీర్య కణ నిర్మాణం, వీర్యం బాగా పెరుగుతాయి (18).

ఆహారంలో మార్పులే కాక, మరికొన్ని చిట్కాలు, సూచనలు పాటిస్తే, మగవారిలోని వీర్య సమస్య పరిష్కరించుకోవడంలో సహాయ పడుతుంది.

వీర్య కణాలను పెంచడంలో సహాయపడే జీవనశైలిలో మార్పులు

కింద సూచించిన మార్పులు మీ వీర్యకణాలకే కాదు శరీర ఆరోగ్యానికి కి కూడా మంచిది.

1. మంచి నిద్ర, వ్యాయామం

అతి బరువు, ఊబకాయం మగవారు తగ్గించుకుంటే, ఆరోగ్యకరమైన వీర్యం పెంపొందించుకోవచ్చు. వ్యాయామం చేసి ఒళ్ళు అలిస్తే, కంటినిండా నిద్ర పోతే, ఆరోగ్యానికి ఎంతో మంచిది.

2. ఒత్తిడిని తగ్గించుకోవాలి

ఒత్తిడి శరీరంలోని శక్తిని హరింపచేస్తుంది. మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు సంతానోత్పత్తి విషయంపై, శరీరంపై ధ్యాస ఉండదు. వత్తిడి ఎందువల్ల కలుగుతుందో, ఆ విషయం ముందు పరిష్కరించుకోవాలి. మగవారిలో వత్తిడి కోసం కొన్నిసార్లు యాంటి డిప్రెస్సంట్ మందులు వాడమని డాక్టర్లు సలహా ఇస్తారు. కానీ ఎక్కువ రోజులు మందులు వాడటం స్పెర్మ్ కౌంట్ కి అంత మంచిది కాదు.

౩. పొగ త్రాగటం మానివేయాలి

పొగ తాగడం అలవాటున్న వారిలో క్రమంగా వీర్య కణాలు తగ్గుతాయి. వీర్య కణాల నాణ్యత కూడా తగ్గుతుంది.అందుకని పొగ తాగడానికి దూరంగా ఉండటం ఉత్తమం (21).

4. మత్తు పదార్ధాలు, తాగుడుకి దూరంగా ఉండాలి

మద్యం మరియు మత్తు పదార్థాలు వంటివి వాడటం వలన వీర్యకణాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

5. మందుల వాడకం వలన ఇబ్బంది

కొన్ని మందుల వాడకం వల్ల స్పెర్మ్ కౌంట్ తాత్కాలికంగా తగ్గుతుంది. ఈ మందుల్ని ఎక్కువ రోజులు వాడటం వల్ల మగవారిలో స్పెర్మ్ ఆకారము, ఉత్పత్తి పై చెడు ప్రభావం ఉంటుంది.

6. రోజువారీ ఆహారంలో విటమిన్ D, కాల్షియం

విటమిన్ D, కాల్షియం స్పెర్మ్ నాణ్యతను పెంచుతాయి. ఏ పదార్ధాలలో ఇవి బాగా ఉన్నాయో తెలుసుకుని రోజు అవి తినాలి లేదా విటమిన్, కాల్షియమ్ టాబ్లెట్స్ రూపం లో నైనా తీసుకుంటే మంచిది.

7. కాలుష్య వాతావరణం

రాను రాను మన చుట్టూ వాతావరణం కాలుష్య మయం అవుతోంది. గాలి, నీరు, అన్నీ కాలుష్య భరితమవుతున్నాయి. వీలైనంత వరకూ స్వచ్ఛమైన వాతావరణంలో ఉండే ప్రయత్నం చేస్తే మంచిది.

మీ వీర్య కణాలలో ఏ సమస్య లేనప్పుడు, ఆరోగ్య కరమైన ఆహారం మరియు జీవనశైలి తో మీ సంతానోత్పత్తి అవకాశాలని పెంచుకోగలరు. కానీ మెడికల్ పరీక్షలలో కనుక మీ కణాలు తక్కువగా ఉన్నాయి అని తేలితే, వైద్యులు చెప్పిన ప్రకారం చికిత్స పొందుతూ, పైన చెప్పిన ఆహారం తీసుకుంటే ఉపకరిస్తుంది.

ఒక గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, పైన చెప్పిన సలహాలు ఏవి వైద్యుల సలహాలను భర్తీ చెయ్యవు. ఇవి కేవలం మీ సమాచారం కొరకే.

మీ సలహాలు, అనుభవాలు కింద కామెంట్స్ సెక్షన్ లో తెలుపగలరు

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

                   *సభ్యులకు విజ్ఞప్తి*

     *********************************

ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

Low Sperm Count Problem

Low sperm count is creation of low quality sperm that is unable to fertilize the female egg. some couples who have been trying to get pregnant may release that all their efforts to conceive may be in vain because the sperm produced by the male is way below normal conditions. Low sperm count is also known as oligospermia.

There are various ways to treat this problem; sperm count can be increased through the following methods:

1) Do not overheat the testicles! – everyone knows that sitting in the hot tub is one of the most enjoyable experiences but be warned, overheating the testicles is not good for sperm count. Avoid anything that could heat the testicles e.g. hot water baths, tight undergarments and saunas.

2) Maintaining a healthy diet – try to avoid processed foods, because over processed foods often lead to a decrease in sperm count. Eating foods that are rich in vitamins are great for boosting the sperm count. Ensure you also add lots of fresh fruits to you diet; the following foods are very good for increasing sperm count:

 Oysters
 Fresh celery
 Bananas
 Almonds
 Avocados etc

3) Masturbate less often – if you can't stop masturbating altogether, maintain a three day break between two successive ejaculations because frequent masturbation make the semen less dense, which leads to low sperm count. Endeavour not to allow masturbation become a habit, you can control it.

4) Nutritional supplements – Many nutritional supplements thuat are either prescribed or sold over the counter can actually help you increase sperm count, available supplements includes:

 Vitamin C, E and B12 supplements – these supplements can help to increase sperm count and also improve the quality of sperm produced, they are also known to protect the sperm from damage too.
 Supplements – studies have shown that supplements not only increase the male sperm count, it also helps to increase fertility in most infertile men.
 Zinc supplements – these supplements are great for raising testosterone levels which in turn increases sperm count.

5) Exercise regularly – when you exercise, you end up shedding excess weight and increase your sperm count in the process. You don't have to be overweight in order to exercise, although obesity contributes to low sperm count but staying healthy is not a bad idea or is it?

Quit unhealthy Life style – lifestyle and habits such as smoking and excessive drinking lead to low sperm count. Please be concern, alcohol and smoking affects the quality of sperm.


కామెంట్‌లు లేవు: