3, జులై 2020, శుక్రవారం

బరువు తగ్గడానికి ఆహారం నియమాలు నవీన్ డైట్ ప్లాన్



బరువు తగ్గడానికి  సులువైన మార్గాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు ..


  • మూడు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే.. బరువు సులభంగా తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు
How to Lose Weight Fast 3 Simple Steps

బరువు తగ్గి.. స్లిమ్ గా అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ.. బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గలేము. ప్రస్తుతం మార్కెట్ లో బరువు తగ్గించేందుకు  ప్రత్యామ్నాయాలు చాలానే పుట్టుకువచ్చాయి. అయితే.. మూడు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే.. బరువు సులభంగా తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Image

ముందుగా బరువు తగ్గాలంటే.. మనం తీసుకునే ఆహారం తగ్గించాలి అలా అని కడుపు మాడ్చుకోకూడదు. కాబట్టి ముందుగా ఆకలిని తగ్గించుకోవాలి. అప్పుడు సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా మీ మెటబాలిక్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది.

స్టెప్ 1.. నో షుగర్, కార్బొ హైడ్రేట్స్

బరువు తగ్గాలి అనుకునే వాళ్లు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే.. షుగర్, కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే ఆహారాన్ని దూరంగా ఉంచాలి. ఎందుకంటే వీటిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ తక్కువగా ఉంటే.. శరీరంలోని కొవ్వు పదార్థాలు చాలా త్వరగా కరిగిపోతాయి. షుగర్, కార్బో హైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే.. మొదటి వారంలో 10 పౌండ్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

Image

స్టెప్ 2.. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం

బరువు తగ్గడం అంటే ఏమి తినకుండా కడుపు మాడ్చుకోవడం కాదు. మంచి ప్రోటీన్స్ గల ఆహారాన్ని తీసుకోవాలి. కార్బొ హైడ్రేట్స్ తక్కువగా ఉండే కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. మీ ఆహారంలో వీటిని కచ్చితంగా తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు.

ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే చికెన్, ఫిష్, సీ ఫుడ్, ఎగ్స్ లాంటివి తీసుకోవాలి. ఇవి మెటబాలిజయం హెల్త్ మెరుగుపడేలా చేస్తాయి. అంతేకాకుండా కార్బో హైడ్రేట్స్ తక్కువగా ఉండే బ్రకోలి, క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ, దోసకాయ, పాలకూర, మష్రూమ్స్, మొలకలు వంటివి తీసుకోవాలి. ఒక రోజులో 20నుంచి 50 గ్రాములకు మించకుండా కార్బొ హైడ్రేట్స్ ఉన్న ఆహారం కూడా తీసుకోవచ్చు.

 అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారు కూడా గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలన్న విషయం మర్చిపోవద్దు. ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, అవకాడో ఆయిల్, వెన్న లాంటివి కొద్ది మొత్తంలో తీసుకోవాలి. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవడం  అలవాటు చేసుకోవాలి. వంట ఎక్కువ శాతం కోకోనట్ ఆయిల్ తో చేసుకోవడం మంచిది. భోజనం చేయడానికి ముందు మంచినీరు తాగడం అలవాటు చేసుకోవాలి.

Image

స్టెప్ 3 వ్యాయామం..

బరువు తగ్గాలనుకునేవాళ్లు చేసే మరో ప్రయత్నం వ్యాయామం. వెయిట్ లాస్ అవ్వాలని అనుకున్న నాటి నుంచి వ్యాయామం చేయడం ప్రారంభించేస్తారు. అయితే.. మరీ అంత కష్టపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. కేవలం వారంలో మూడు లేదా నాలుగు రోజులు జిమ్ కి వెళ్లి బరువులు ఎత్తితే సరిపోతుంది అంటున్నారు. బరువులు ఎత్తడం వల్ల శరీరంలోని కొవ్వులు కరిగి బరువు తగ్గుతారు. నిపుణుల పర్యవేక్షణలో చేయడం తప్పనిసరి. కచ్చితంగా బరువులే మోయాలని లేదు. కావాలంటే వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ లాంటివి కూడా చేయవచ్చు.

ఈ మూడు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే.. చాలా సులభంగా, త్వరగా బరువు తగ్గవచ్చు.


కేవలం 10 రోజుల్లో బరువు తగ్గడానికి సాధారణ సలహాలు 

బరువు తగ్గాలి అనుకునేవారికి చాలామంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు బరువు తగ్గడానికి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటారు కానీ వాస్తవానికి చాలావరకు వాటి వెనుక శాస్త్రీయమైన ఆధారాలు లేవు.

ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేసి సమర్థవంతంగా కనిపించే అనేక బరువు తగ్గించే చిట్కాలు కనుగొన్నారు. వాస్తవానికి శాస్త్రవేత్త ఆధారిత 21 బరువు తగ్గించే చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

ఎక్కువ పీచు పదార్థాలను తినండి

ఎక్కువ పీచు పదార్థం ఉన్న ఆహారాలు కింద చిత్రంలో ఉన్నాయి

బరువు తగ్గడానికి ప్రోటీన్ పీచు-పదార్థాలను


మీ ఆహారంలో ఎక్కువ పీచు పదార్థాలను ఉండేటట్టుగా చూడండి దీని వాళ్ల మీరు తక్కువ కేలరీల తీసుకోవడానికి సహాయపడుతుంది పీచుపదార్థాలున్న ఆహారం బరువు తగ్గడానికి సిఫార్సు చేయబడింది. రోజుకు 30 గ్రాములు పీచు పదార్థాలు తినాలి , కానీ చాలా మంది తగినంత పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోరు. కొన్ని అధ్యయనాలు ప్రకారం పీచు పదార్థాలు దీర్ఘకాలికంగా మీ బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయని చూపిస్తున్నాయి

ఇది ఎలా సహాయపడుతుంది?

పీచు పదార్థం ఆహారం రెండు రకాలుగా ఉంటుంది

  1. నీటిలో కలిగేది
  2. నీటిలో కరగనిది

నీటిలో కరిగే పీచు పదార్థం తమ ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ సమయంలో పీచు పదార్థం నీటిని గ్రహించి జెల్ కింద మారుతుంది. ఇంకా కరగని పీచు పదార్థం పేగులు గుండా వెళుతున్నప్పుడు కరగని ఫైబర్ జీర్ణించుకోలేదు. రెండు రకాల ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది మరియు ఎక్కువ సమయం పొట్ట నిండినట్లుగా అనుభూతి చెంది ఆకలి వెయ్యదు పైగా పీచు పదార్థాలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే బరువు తగ్గించడానికి సహాయం చేస్తుంది

పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్ల) తీసుకోవడం తగ్గించండి

బరువు తగ్గడానికి carbohydrates-food


కార్బోహైడ్రేట్లు చాలా మంది ఆహారంలో ప్రధానమైనవి చక్కెర ఎక్కువ ఉన్న కార్బోహైడ్రేట్ ఆహారం ఎందుకు అంటే ఎక్కువ మందికి తీపి ఎక్కువ ఉన్న పదార్థాలు ఇష్టపడతారు కాకపోతే మన ఆధునిక ఆహారంలో చెత్త పదార్ధాలలో చక్కెర ఒకటి అని చెప్పవచ్చు వాస్తవానికి, ఒక గ్రాము కార్బోహైడ్రేట్ నాలుగు కేలరీలను కలిగి ఉంటుంది ఇది బరువు పెరిగే సమస్యను పెంచుతుంది. పిండి పదార్థాలు అధికంగా ఉండే చాలా ఆహారాలు ఇతర పోషకాలను కలిగి ఉండవు ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు

అధ్యయనాల ప్రకారం చక్కర ఎక్కువగా వినియోగిస్తున్న వారి లో బరువు పెరుగుతారు
మరియు ఊబకాయం ,మధుమేహం మరియు గుండె జబ్బు పరిస్థితులు వస్తాయని చెబుతున్నారు

మీరు బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్ ఆహారాన్ని తగ్గించి. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మంచిది

ఇది ఎలా సహాయపడుతుంది?

పిండి పదార్థాలతో(కార్బోహైడ్రేట్స్) ఎక్కువగా ఉంటాయి దీనివల్ల మీరు తీసుకునే ఆహారంలో చాలా కేలరీలను జోడిస్తుంది, అందువల్ల పిండి పదార్థాలను తగ్గించడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది కింద చిత్రంలో కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలు ఉన్నాయి వీటిని తక్కువ తినడం మంచిది

గొప్ప ఆరోగ్యకరమైన కొవ్వులు తినండి

బరువు తగ్గడానికి carbohydrates-food

చాలామందికి సందేహం రావచ్చు కొవ్వు పదార్థాలు తింటే ఎక్కువగా బరువు పెరుగుతారు కదా అని కానీ అది నిజం కాదు కొవ్వు పదార్థాల్లో రెండు రకాలు ఉంటాయి ఆరోగ్యమైన కవులు మరియు అనారోగ్య మైనవి ఉంటాయి . మీరు తినే కొవ్వులు మీ ఆరోగ్యానికి మంచివని నిర్ధారించుకోవాలి.

ఇది ఎలా సహాయపడుతుంది?


చాలా జంక్ ఫుడ్స్ లో అనారోగ్య లేదా సంతృప్త కొవ్వులు ఉంటాయి కాబట్టి బయట లభించే జంక్ ఫుడ్ అలాగే నూనె పదార్థాలు తో చేసే బజ్జీలు వంటి తినడం మానేయాలి వీటి బదులుగా అవోకాడో, ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనెలో కూడా అధికం కొవ్వు పదార్థాలు ఉంటాయి కానీ ఇది బరువుని తగ్గిస్తుంది మరియు గింజలలో లభించే అసంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించటానికి సహాయపడతాయి.

లావుగా ఉన్నవారు వీలైనంత వరకు టైట్ గా వుండే దుస్తులు ధరించకూడదు.
దీని వలన స్థూలకాయం మరింత అసహ్యం గా కనిపిస్తుంది. సల్వార్ కమీజ్.
కుర్తాలు, చుడీదార్ లో వారికి బాగా వుండవు. చీరలు ధరిస్తే నే మంచిది

చిన్న చిన్న మార్పులు


చిన్న చిన్న మార్పులే చాలా ప్రభావం చూపుతాయి ఉదాహరణకి ఎలివేటర్‌కు బదులుగా మెట్లు ఎక్కండి. దగ్గర్లోలో షాపింగ్ వెళ్లాల్సిన అప్పుడు బైక్ కార్ బదులుగా 30మి నడుచుకుంటూ వెళ్లి హాయిగా షాపింగ్ చేసి రండి ఇవి చిన్నచిన్న పనులైనా బరువు తగ్గించడంలో చాలా ప్రభావం చూపుతాయి అని అధ్యయనాలు చెబుతున్నాయి

ఇది ఎలా సహాయపడుతుంది?

కొద్దిగా వ్యాయామం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం కేలరీలను తగ్గించడానికి సహాయపడుతుంది మరియు మీ జీవక్రియను పెంచుతుంది. ఇది మీ కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది మరియు కండరాలకు కొవ్వు కంటే ఎక్కువ కేలరీలు అవసరం కాబట్టి, మీరు ప్రతిరోజూ గణనీయమైన కేలరీలను ఖర్చు చేస్తారు.

మీ ఇంటిలోనే భోజనం తయారు చేసుకోవాలి

మీ స్వంత భోజనం వండుకోవడం చాలా ముఖ్యమైనది బయట లభించే ఆహార పదార్థాలు ఎక్కువగా నెయ్య డాల్డా మరియు నాసిరకమైన నూనెను వాడుతూ ఉంటారు వీటివల్ల మీరు బరువు అధికంగా పెరుగుతారు కాబట్టి మీరు బరువు తగ్గాలని అనుకున్నట్లయితే మీరు ఇంట్లోనే భోజనం తయారు చేసుకోండి

ఇది ఎలా సహాయపడుతుంది?

మీరు తినే భోజనం మీకు ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఉత్తమ మార్గం అది మీరే తయారు చేసుకోవడం. ఆ విధంగా మీకు నచ్చినవి స్వయంగా తయారు చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన వంటకాల తక్కువ కేలరీల ఉండేట్లు చూసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

నల్లని చారలు, సన్నని నిలువు గీతల, చిన్న డిజైన్, సన్నని చుక్కలు ఉండే
పలుచని దుస్తులు లావు గా ఉండే వారికి బాగుంటాయి. గంజి పెట్టి ఐరన్ చేసిన
దుస్తులు వీరికి బాగుండవు.

తగినంత నీరు త్రాగాలి ముఖ్యంగా భోజనం ముందు నీరు త్రాగాలి

త్రాగునీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందని తరచూ చెబుతారు – ఇది నిజం.

మీ ఆరోగ్యానికి తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. తగినంత నీరు తీసుకోకపోవడం వాస్తవానికి మీరు ఎంత బరువు కలిగిస్తుందో ప్రభావితం చేస్తుంది త్రాగునీరు 1–1.5 గంటల వ్యవధిలో జీవక్రియను 24–30% పెంచుతుంది, మరికొన్ని కేలరీలను కొచ్చి చెయ్యడంలో మీకు సహాయపడుతుంది

ఒక అధ్యయనం ప్రకారం భోజనానికి అరగంట ముందు అరగంట ( పావు లీటరు) నీళ్లు తాగడం వల్ల తక్కువ కేలరీలు తినడానికి మరియు 44% ఎక్కువ బరువు తగ్గడానికి సహాయపడింది,

ఇది ఎలా సహాయపడుతుంది?

కొన్నిసార్లు, దాహం మీ మెదడు ఆకలి బాధగా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, మీరు నిజంగా ఆకలితో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి, ఏదైనా తినడానికి ముందు ఒక గ్లాసు నీరు త్రాగడానికి ప్రయత్నించండి.

అల్పాహారం – టిఫిన్

Nutrition food పౌష్టిక

చాలామంది ఉదయాన్న టిఫిన్ తిన్నారు హ ఏముందిలే టిఫిన్ తినకపోతే బరువు తగ్గొచ్చు అని అనుకుంటారు కానీ ఇది చాలా పొరపాటు టిఫిన్ తినకపోతే బరువు తగ్గడం కాదు బరువు పెరుగుతారు , మీరు టిఫిన్ తినకపోతే మీరు భోజనం చేసే సమయానికి ఇంకా ఎక్కువ ఆకలేసి ఇక కేలరీల ఉన్న ఆహారాన్ని తింటారు అని పరిశోధన ప్రకారం చెబుతున్నారు

ఎక్కువ కేలరీలు ఉన్న పూరి లాంటివి తినకుండా బరువు తగ్గడానికి సహాయపడే ఉడికించిన కోడి గుడ్డుని తినడం మంచిది.

మీ అల్పాహారాన్ని గుడ్లతో భర్తీ చేయడం వల్ల వచ్చే 36 గంటలు తక్కువ కేలరీలు తినవచ్చు, అలాగే ఎక్కువ బరువు మరియు శరీర కొవ్వు తగ్గవచ్చు అని అధ్యయనాలు చెబుతున్నాయి.

కాఫీ తాగండి (బ్లాక్ కాఫీ)

నాణ్యమైన బ్లాక్ కాఫీలో యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంది మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది .

కాఫీలోని కెఫిన్ జీవక్రియను 3–11% పెంచుతుందని మరియు కొవ్వు కలిగించడానికి 10–29% వరకు పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి

మీ కాఫీకి చక్కెర లేదా పాలు ఇతర అధిక కేలరీల పదార్ధాలను జోడించకుండా చూసుకోండి .

గ్రీన్ టీ తాగండి

కాఫీ మాదిరిగా, గ్రీన్ టీ కూడా చాలా ప్రయోజనాలను కలిగి ఉంది, వాటిలో ఒకటి బరువు తగ్గడం.

గ్రీన్ టీలో తక్కువ మొత్తంలో కెఫిన్ ఉన్నప్పటికీ ఇది కాటెచిన్స్ అని పిలువబడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో కలిగి ఉంటుంది ఇవి కొవ్వు దహనం పెంచడానికి కెఫిన్‌తో సినర్జిస్టిక్‌గా పనిచేస్తాయని నమ్ముతారు

గ్రీన్ టీ (పానీయం లేదా గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్ సప్లిమెంట్‌గా) బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుందని చాలా అధ్యయనాలు చూపిస్తున్నాయి

అడపాదడపా ఉపవాసం చేయండి

చాలామంది ఉపవాసం అంటే వామ్మో రోజంతా ఏమీ తినకుండా ఉండాలి అని అనుకుంటారు కానీ అది అసలు సిసలైన ఉపవాసం కాదు అని చెప్పవచ్చు ఉపవాసం అనేది ఒక ప్రసిద్ధ తినే పద్ధతి మనం రోజూ తీసుకునే ఆహారం కాకుండా కేవలం ఆరోజు శరీరానికి కావాల్సిన అతి తక్కువ ఆహారం తీసుకోవడం

నిరంతర కేలరీల పరిమితి వలె బరువు తగ్గడానికి అడపాదడపా ఉపవాసం ప్రభావవంతంగా ఉంటుందని స్వల్పకాలిక అధ్యయనాలు సూచిస్తున్నాయి

షుగర్ ఉన్నవాళ్లు ఈ ఉపవాసాన్ని పట్టించ వద్దు అలాగే ఉద్యోగం లేదా పనికి వెళ్ళే రోజు మాత్రం ఉపవాసం చేయవద్దు ఇంట్లో ఉండే రోజు శనివారం లేదా ఆదివారం చేయండి.

కాటన్ చీరలు కట్టాలనుకునేవారు బ్లెండెడ్ చీరలు ధరించవచ్చు. హై నెక్
బ్రౌజ్లు వీరికి బావుండవు. దీనివలన మరింత వెడల్పు అయినట్లు కనబడుతారు.
రౌండ్ స్క్వయర్ నెక్ బావుంటాయి

చిన్న ప్లేట్లు వాడండి

చిన్న ప్లేట్లు ఉపయోగిస్తే మనం తక్కువ ఆహారం ప్లేట్ లో పెట్టుకున్న ఎక్కువ ఆహారం ఉన్నట్లు అనిపిస్తుంది దీనివల్ల మీరు తక్కువ ఆహారం తినడానికి అవకాశం ఎక్కువ ఉంది

ఇది చాలా చిన్న మార్పు కానీ రోజు రోజు పోలిస్తేనా నెలకి చాలా తక్కువ ఆహారం తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది,

మీరు ఆకలితో ఉన్న సందర్భంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉంచండి

belly fat

మీకు ఎక్కువగా ఆకలి వేసే సమయంలో మీరు రోజూ తినే ఫాస్ట్ ఫుడ్ లేదా బజ్జీలు తినాలన్న కోరిక వస్తుంది కాబట్టి సమీపంలో ఆరోగ్యకరమైన ఆహారం ఉంచుకోండి దీనివల్ల బరువు పెరిగే ఆహారాన్ని తినాలనే కోరిక ని తగ్గించి మీ దగ్గర ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు

ఫాస్ట్ ఫుడ్ మిరపకాయ బజ్జీలు బదులుగా ఉడికించిన కూరగాయలు, క్యారెట్, మీగడ లేని పెరుగు, లేదా ఉడికించిన గుడ్డును తినండి

కారం ఎక్కువ ఉన్న ఆహారాన్ని తినండి

మిరపకాయలలో క్యాప్సైసిన్ అనే మసాలా సమ్మేళనం ఉంటుంది, ఇది జీవక్రియను పెంచుతుంది మరియు మీ ఆకలిని కొద్దిగా తగ్గిస్తుంది.

వ్యాయామం చేయండి

యోగ మరియు ఏరోబిక్ ఇలాంటి వ్యాయామం చేయండి ఇది మీ కేలరీలను కరుణించడానికి శారీరక ,మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన మార్గం.

ఉదయాన్నే సూర్య నమస్కారాలు వెయ్యండి ఇది మీ బరువును తగ్గించడానికి చాలా ప్రభావమంతగా పనిచేస్తుంది మరియు జీవక్రియ వ్యాధికి కారణమయ్యే అనారోగ్య కొవ్వు నీ తగ్గిస్తుంది

బరువులు ఎత్తండి

మగవారికి అయితే బరువు తగ్గడం తో పాటు కండరాలు పెరగడం కూడా చాలా ముఖ్యం ఉదయాన్నే వెయిట్ లిఫ్టింగ్ చేయండి ఇది కండరాల పెరగడానికి మరియు జీవక్రియ సహాయపడుతుంది

మీ జీవక్రియను అధికంగా ఉంచడానికి మరియు విలువైన కండర ద్రవ్యరాశిని కోల్పోకుండా నిరోధించడానికి వెయిట్ లిఫ్టింగ్ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి

వాస్తవానికి, కొవ్వును కోల్పోవడమే కాదు – మీరు కండరాలను కూడా నిర్మించుకోవాలని.

ఎక్కువ కూరగాయలు, పండ్లు తినండి

కూరగాయలు మరియు పండ్లలో బరువు తగ్గడానికి అనేక లక్షణాలు ఉన్నాయి.

వాటిలో కొన్ని కేలరీలు ఉంటాయి కాని చాలా ఫైబర్ ఉంటుంది. కూరగాయలు మరియు పండ్లు తినే వ్యక్తులు తక్కువ బరువు కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి

ఈ ఆహారాలు కూడా చాలా పోషకమైనది, కాబట్టి వాటిని తినడం మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

ముదురు రంగు చీర ల కంటే లేత రంగు వస్త్రాలు బావుంటాయి. సన్నని పొడవైన
ఆభరణాలు ధరించాలి.
లిప్స్టిక్, ఫ్యాన్స్ నగలు కూడా వీలైనంత లేతరంగువి వాడాలి.

మరింత నెమ్మదిగా నమలండి

మీరు ఆహారం తింటున్నారని నమోదు చేయడానికి మీ మెదడు కొంత సమయం పడుతుంది. కొన్ని అధ్యయనాలు ప్రకారం నెమ్మదిగా నమలడం వలన తక్కువ కేలరీలు తినడానికి మరియు బరువు తగ్గడానికి అనుసంధానించబడిన హార్మోన్ల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి

మంచి నిద్ర పొందండి

బరువు తగ్గడానికి ప్రోటీన్ మంచి-నిద్ర-పొందండి

నిద్ర చాలా తక్కువగా అంచనా వేస్తారు చాలామంది, కానీ ఆరోగ్యంగా తినడం మరియు ఆరోగ్యకరమైన నిద్ర కూడా అంతే ముఖ్యమైనవి.

తక్కువ నిద్ర బరువు పెరగడానికి ప్రమాద కారకాల్లో ఒకటి అని అధ్యయనాలు చెబుతున్నాయి, ఎందుకంటే ఇది పిల్లలలో 89% బరువు పెరగడానికి మరియు 55% పెద్దలలో బరువు పెరిగే బట్లు చేస్తుంది అని తాజా అధ్యయనంలో తేలింది కాబట్టి చక్కని నిద్ర తప్పనిసరి

ఎక్కువ ప్రోటీన్ తినండి

బరువు తగ్గడానికి ప్రోటీన్

బరువు తగ్గడానికి ప్రోటీన్ అతి ముఖ్యమైన పోషకం . అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తినడం వల్ల రోజుకు 80–100 కేలరీలు తగ్గించే జీవక్రియను పెంచుతాయని తేలింది,

శాస్త్రవేత్తలు కొంతమంది పై చేసిన అధ్యయనం ప్రకారం తేలింది ఏమిటంటే రోజువారీ కేలరీలలో 25% ప్రోటీన్ గా తినడం వలన ఆహారం తినాలనే ఆలోచనలను 60% తగ్గించాయి అంట

మీ ఆహారంలో ప్రోటీన్ జోడించడం బరువు తగ్గడానికి సులభమైన మరియు ప్రభావితమైన మార్గాలలో ఒకటి.

సోడా మరియు కూల్ డ్రింక్స్ అసలు తాగవద్దు

బరువు తగ్గడానికి

సోడాలు మరియు కూల్ డ్రింక్ తాగడం వల్ల ఘోరంగా బరువు పెరుగుతున్నారని కూల్ డ్రింక్స్ వల్ల వచ్చే కేలరీలు అత్యంత కొవ్వు కారకంగా ఉంటున్నాయి అని అధ్యయనాలు చెబుతున్నాయి

ఉదాహరణకు, ఒక అధ్యయనం కూల్ డ్రింక్స్ మరియు చక్కెర పానీయాలు ప్రతి రోజువారీ తీసుకోవడం ద్వారా పిల్లల్లో 60% బరువు పెరుగుతున్నారని అధ్యయనంలో తేలింది

ఇది పండ్ల రసానికి కూడా వర్తిస్తుందని గుర్తుంచుకోండి , దీనిలో కోక్ వంటి శీతల పానీయం వలె చక్కెర ఉంటుంది.

మొత్తం పండు తినండి, కానీ పండ్ల రసాన్ని పూర్తిగా పరిమితం చేయండి లేదా నివారించండి.

అతి ముఖ్యమైనది

బాబోయ్ బరువు తగ్గాలంటే ఇన్ని పనులు చెయ్యటాలా అనుకుంటే అస్సలు బరువు తగ్గలేరు బరువు తగ్గాలి అని నిశ్చయించుకున్నప్పుడు క్రమం తప్పకుండా అన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది ఇలా కాకుండా ఒక రోజు రెండు రోజులు వ్యాయామం చేసి లేదా మంచి ఆహారం తిని మరల రెండు రోజులు వాయనం చేయకుండా జంక్ ఫుడ్ లాంటివి తింటే ఫలితం ఉండదు కాబట్టి నెల రోజుల్లో లేదా రెండు నెలల్లో కచ్చితంగా బరువు తగ్గాలని మీరు నిశ్చయించుకుంటే దానికి కట్టుబడి ఉంటే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు మీ మెదడు కూడా దానికి సహకరిస్తుంది.. క్రమం తప్పకుండా వ్యాయామం మరియు పై చిట్కాలు పాటిస్తే నూటికి నూరు శాతం మీరు ఖచ్చితంగా బరువు తర్వాత తగ్గుతారు

కేవలం 10 రోజుల్లో బరువు తగ్గడానికి డైట్ ప్లాన్

మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది – మీరు బరువు తగ్గాలి అనుకుంటే మేము పైన చెప్పిన చిట్కాలను పాటించడం ద్వారా ఒక నెలలో కొన్ని కిలోలు సులభం బరువు తగ్గుతారు మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకుని మరియు మంచి ఆరోగ్య మార్గంలో బరువు తగ్గుతారు మరియు పైన చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల మరి మళ్ళీ తిరిగి బరువు పెరుగుతారనే సమస్య ఉండదు ఈ పద్ధతి మీ ఆరోగ్యానికి కూడా మంచిది

మీరు త్వరగా 10 రోజుల్లో బరువు తగ్గాలని చేస్తున్నట్లయితే కింద చెప్పిన డేట్ ప్లాన్ పాటించండి ఇది కేవలం 10 రోజుల్లో మీ పెళ్లి లేదా ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు కోసం కఠినమైన ఆహారాన్ని పాటించడం ద్వారా మీరు 10 రోజుల్లో గణనీయమైన బరువును త్వరగా కోల్పోతారు. ఆ తర్వాత మీరు సాధారణ ఆహారం తీసుకుంటే క్రమక్రమంగా కొంచెం కొంచెం బరువు పెరుగుతారు. ఈ పద్ధతి తాత్కాలిక బరువు తగ్గటం మాత్రమే పూర్తిస్థాయి ఫలితం కోసం అయితే చిట్కాలను పాటించండి

రోజులుఉదయం పానీయంఅల్పాహారం (ఉదయం 9 లోపు)భోజనం (మధ్యాహ్నం 1.30 లోపు)సాయంత్రం పానీయంసాయంత్రం తీసుకోవడం (5 నాటికి)విందు (9 లోపల)
రోజు 1వేడి నీళ్ళలో తేనె నిమ్మరసం కలుపుకుని తాగడంవోట్స్ లేదా ప్రోటీన్ భోజనం *చిన్న కప్పు బియ్యం + 3 ఉడికించిన కూరగాయలు (బంగాళాదుంపలను నివారించండి) + 1 లేదా 2 చపాతీలుచక్కెర లేకుండా గ్రీన్ టీచిన్న కప్పు మొలకలు (లేదా) ఫైబర్ కంటెంట్ పండ్లు2 నుండి 3 చపాతీలు
2 వ రోజు

3 వ రోజు
4 వ రోజుచక్కెర లేకుండా తేనె (లేదా) గ్రీన్ టీ తాగడంప్రోటీన్ భోజనం *1 మీడియం కప్పు గోధుమ బియ్యం + 2 చపాతీఒక కప్పు వెజ్ సలాడ్ +2 చపాతీలుఒక కప్పు వెజ్ సలాడ్ + 2 చపాతీలు
5 వ రోజు
6 వ రోజు
7 వ రోజుగ్రీన్ టీప్రోటీన్ భోజనం *1 మీడియం కప్పు గోధుమ బియ్యం (లేదా) 2 చపాతీలుఒక చిన్న కప్పు మొలకలుప్రోటీన్ భోజనం *
8 వ రోజు
9 వ రోజు
10 వ రోజు

1 thought on “కేవలం 10 రోజుల్లో బరువు తగ్గడానికి taggutaruw

ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: