30, జులై 2020, గురువారం

నెఫ్రోటిక్ సిండ్రోమ్ ప్రేకలుషన్స్ అవగాహనా కోసం


నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

నెఫ్రోటిక్ సిండ్రోమ్ లో మూత్రపిండాలు అవి పనిచేయవలసిన  విధంగా పనిచేయవు. మూత్రంలో అల్బుమిన్ అని పిలువబడే ప్రోటీన్ విడుదల కావడం ద్వారా ఇది గుర్తించబడుతుంది. ఈ ప్రోటీన్ శరీరంలోని అదనపు ద్రవాన్ని రక్తంలోకి శోషించడంలో/చేరవేయడంలో బాధ్యత వహిస్తుంది. ఈ ప్రోటీన్ నష్టం శరీరంలో ద్రవం ఎక్కువగా నిలిచిపోవడానికి కారణమవుతుంది అది ఎడిమ (oedema) కు దారితీస్తుంది. నెఫ్రోటిక్ సిండ్రోమ్ను పెద్దలు మరియు పిల్లలలో కూడా గమనించవచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

నెఫ్రోటిక్ సిండ్రోమ్లో ఈ క్రింది సంకేతాలను మరియు లక్షణాలను గమనించవచ్చు:

  • మూత్రంలో ప్రోటీన్ అధికమవ్వడడం (ప్రొటీన్యూరియా [proteinuria])
  • రక్తంలో ప్రోటీన్ స్థాయిలు తగ్గిపోవడం (హైపోఆలబ్యుమినేమియా [hypoalbuminemia])
  • రక్తంలో అధిక కొవ్వు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు (మరింత సమాచారం: అధిక కొలెస్ట్రాల్ యొక్క చికిత్స)
  • పాదాలు, చీలమండలు, కాళ్ళ యొక్క వాపు (ఎడిమ)
  • అరుదుగా చేతులు మరియు ముఖపు వాపు
  • అలసట
  • బరువు పెరుగుట
  • ఆకలిలేమి

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మూత్రపిండాలు సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోయినప్పుడు (వాడకట్టలేనప్పుడు) నెఫ్రోటిక్ సిండ్రోమ్ సంభవిస్తుంది. రెండు రకాల కారణాలు ఉన్నాయి, అవి  ప్రాథమిక మరియు ద్వితీయ.

  • ప్రాథమిక కారణాలు: నేరుగా మూత్రపిండాలను ప్రభావితం చేసే వ్యాధి వలన నెఫ్రోటిక్ సిండ్రోమ్ సంభవిస్తుంది, ఉదా. ఫోకల్ సెగ్మెంటల్ గ్లోమెరులోస్క్లెరోసిస్ (focal segmental glomerulosclerosis) మరియు మినిమల్ చేంజ్ డిసీజ్ (minimal change disease).
  • ద్వితీయ కారణాలు: మూత్రపిండాలతో సహా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేసే ఒక వ్యాధి నెఫ్రోటిక్ సిండ్రోమ్ సంభవిస్తుంది, ఉదా., మధుమేహంహెచ్ఐవి సంక్రమణ మరియు క్యాన్సర్ వంటివి.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఎడిమ యొక్క ఉనికిని గుర్తించడానికి వైద్యులు శారీరక పరీక్ష చేస్తారు. నెఫ్రోటిక్ సిండ్రోమ్ యొక్క నిర్ధారణకు సిఫార్సు చేసే పరీక్షలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

  • మూత్రంలో ప్రోటీన్ ఉనికిని గుర్తించడానికి మూత్రం యొక్క డిప్ స్టిక్ పరీక్ష (Dipstick test)
  • ప్రోటీన్ మరియు లిపిడ్ స్థాయిలను పరిశీలించేందుకు రక్త పరీక్ష
  • కిడ్నీ యొక్క జీవాణుపరీక్ష (బయాప్సీ)
  • అల్ట్రాసోనోగ్రఫీ (Ultrasonography)
  • మూత్రపిండాల యొక్క సిటి (CT) స్కాన్

నెఫ్రోటిక్ సిండ్రోమ్కు చికిత్స లేదు అయినప్పటికీ, లక్షణాల యొక్క నిర్వహణ ద్వారా మూత్రపిండాలకు మరింత హాని కలుగకుండా చేయవచ్చు. మూత్రపిండాలు పూర్తిగా పనిచేయకపోతే లేదా పూర్తిగా విఫలమైతే, మూత్రపిండ మార్పిడి లేదా డయాలిసిస్ అనేవి చికిత్సా ఎంపికలుగా ఉంటాయి. వైద్యులు ఈ  క్రింది వాటికోసం మందులను సిఫార్సు చేయవచ్చు

  • రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణ
  • అదనపు నీటిని తొలగించడం ద్వారా ఎడిమ తగ్గించడం
  • గుండెపోటు లేదా స్ట్రోక్ దారితీసే రక్త గడ్డలను (మందులను) నివారించడం

ఉప్పును  తీసుకోవడం తగ్గించడం ద్వారా సరైన ఆహార నిర్వహణ మరియు శరీరంలో కొవ్వును తగ్గించడం వంటివి నెఫ్రోటిక్ సిండ్రోమ్ యొక్క నిర్వహణలో సహాయపడ

నెఫ్రోటిక్ సిండ్రోమ్ కొరకు మందులు

Medicine NamePack Size
Dexoren SDexoren S Eye/Ear Drops
BetnesolBetnesol 4 Tablet
WysoloneWysolone 20 Tablet DT
PropyzolePropyzole Cream
Propyzole EPropyzole E Cream
Canflo BNCanflo BN Cream
Toprap CToprap C Cream
Crota NCrota N Cream
Canflo BCanflo B Cream
Sigmaderm NSigmaderm N 0.025%/1%/0.5% Cream
FucibetFucibet Cream
Rusidid BRusidid B 1%/0.025% Cream
Tolnacomb RfTolnacomb Rf Cream
Fusigen BFusigen B Ointment
Low DexLow Dex Eye/Ear Drops
Xeva NcXeva Nc Tablet
Futop BFutop B Cream
ZotadermZotaderm Cream
Heximar BHeximar B Ointment
Azonate GCAzonate GC Cream
Psoriex PlusPsoriex Plus Ointment
B N C (Omega)B N C Burn Care Cream
Cans 3Cans 3 Capsule
Sorfil SSorfil S Ointment

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: