15, జులై 2020, బుధవారం

పిల్లలు ఆరోగ్యం సమస్య పై అవగాహనా సలహాలు


వానా కాలంలో పిల్లల కు కరోనా నుండి  ఆరోగ్యానికి రక్షణ  టిప్స్ ఇవే..అవగాహనా కోసం నడిమింటి సలహాలు 

వానాకాలంలో పిల్లలకు ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయికావాలనే  వానలో తడుస్తుంటారుసాధారణంగా పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువదాంతో జలుబుదగ్గుజ్వరాల బారిన పడతారుఈ కాలంలో ఇంట్లోనే కాదుఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలితరచూ డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లేకంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీలైనంత వరకు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

 

ఈ కాలంలో పిల్లలకు రోగనిరోధక శక్తి పంచే ఫుడ్‌ ఇవ్వాలి.

తినే పదార్థాల్లో విటమిన్‌ సి ఉండేలా చూసుకోవాలి.

ఈ రోజుల్లో పిల్లలు పానీపూరి, మిర్చిబజ్జీల్లాంటివి ఎక్కువ తింటుంటారు. చిరుతిళ్లు బయటవి కాకుండా ఇంట్లో వండి పెట్టడం బెటర్.

స్కూల్‌ నుంచి తడిచి వస్తే, వెంటనే స్నానం చేయించి పొడి బట్టలు వేయాలి.

    పిల్లల గది కూడా చల్లగా లేకుండా పొడిగా, వెచ్చగా ఉండేలా చూడాలి.

ఏవైనా తినేముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోమని చెప్పాలి. లేదంటే చేతుల ద్వారా బ్యాక్టీరియా లోపలకు వెళ్లొచ్చు.

     పిల్లలు ఇంట్లో గచ్చు మీద ఆడుకుంటుంటారు. కానీ వానాకాలంలో గచ్చు చల్లగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కింద ఆడుకోనీయకుండా చూడాలి.

చిన్నపిల్లలైతే పాదాలకు సాక్స్‌ వేయడం మర్చిపోకూడదు. బయటకెళ్తే షూ వేయాలి.

బయటకు పంపేటప్పుడు గొడుగు లేదా రెయిన్‌కోటు లేకుండా పంపకూడదు.

వారానికి ఒకసారైనా పిల్లల దుస్తులు, వాళ్లు వాడే వస్తువులు వేడి నీళ్లతో శుభ్రంగా ఉతకాలి.

     ఈ కాలంలో ఇంట్లోకి దోమలు, ఈగలు లాంటి క్రిమికీటకాలు రాకుండా చూసుకోవాలి 

జలుబు, దగ్గు నుంచి పిల్లలకు ఉపశమనం లభించాలంటే?



            వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ బాగా వేధించే సమస్యలు జలుబు, దగ్గు. ఈ సమస్యల నుంచి పెద్దలు, పిన్నలు ఉపశమనం పొందాలంటే.. హోం మేడ్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. 
 
జలుబు, దగ్గు తగ్గాలంటే.. నీటిలో కొద్ది పరిమాణంలో వాము, తులసి ఆకులు వేసి మరిగించాలి. ఆ ఆవిరిని చిన్నారికి పట్టిస్తే దగ్గు చాలావరకు తగ్గిపోతుంది. 
 
పసుపు యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. వైరల్ ఇన్ ఫెక్షన్లపైనా ఇది సమర్థంగా పనిచేస్తుంది. వేడి పాలలో కొంచెం పసుపు వేసి జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు తాగిస్తే ఎంతో రిలీఫ్‌గా ఫీలవుతారు. 


జలుబు చేసినప్పుడు గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే.. గ్లాసు వేడి నీటిలో టీస్పూను ఉప్పు వేసి బాగా కరిగిన తర్వాత పుక్కిట పట్టాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే సరి. 
 
వేడి నీటి ఆవిరి పట్టినా ఉపశమనం కలుగుతుంది. 10-15 నిమిషాల పాటు ఇలా ఆవిరి పట్టాలి. ఆ నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలిపితే మరీ మంచిది. శ్వాస సాఫీగా సాగేందుకు ఇది ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది. 
 
రోజులో రెండు మూడు సార్లు తేనెను వారితో కొద్దికొద్దిగా నాకిస్తే వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. ఐదేళ్ళ వయసు పైబడిన పిల్లలకు తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి తినిపిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లల ఛాతీపై ఆవనూనెకు వెల్లుల్లి కలిపి మసాజ్ చేయాలి. చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మెల్లగా మసాజ్ చేయాలి. 
 
శరీరానికి మంచినీరు ఎంతో అవసరం. పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఎక్కువ సార్లు మంచినీరు తాగించాలి. అప్పుడు శరీరం వ్యాధితో సమర్థంగా పోరాడగలదు. కోల్పోయిన నీటి శాతం వెంటనే భర్తీ అవుతుంది.

పిల్లలకు జ్వరం అంటేనే గాబరా పడిపోతే ఎలా..?


* చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు జ్వరం రాగానే గాబరా పడిపోతూ వెంటనే 'ప్యారాసిటమాల్' మాత్రలను మింగిస్తుంటారు. నిజానికి అంతగా గాబరా పడాల్సిన అవసరమేమీ లేదనీ వైద్యులు చెబుతున్నారు. జ్వరం రావటమనేది.. వ్యాధి కారకాలతో వారి శరీరం జరుపుతున్న పోరాటంలో భాగమని గుర్తించాలని అంటున్నారు.

* శరీరం వేడిగా మారటం మూలంగానే ఒంట్లో ఉన్న వైరస్‌ వంటి వ్యాధికారకాలు ఎన్నో చనిపోతాయి. కాబట్టి జ్వరం వచ్చి... బిడ్డ చాలా అసౌకర్యంగా ఉన్నప్పుడే జ్వరం తగ్గించే మందులు వెయ్యాలి. ఒళ్లు వేడిగా ఉన్నా పిల్లలు బాగానే తిరుగుతుంటే దాన్ని పట్టించుకోనక్కర్లేదు. పిల్లలు డల్‌గా ఉన్నా, చికాకుగా ఉన్నప్పుడు మాత్రమే ప్యారాసిటమాల్‌ మాత్రను మింగిచాలని వైద్యులు సూచిస్తున్నారు.

* అలాగే పిల్లలు వణుకుతున్నా, ఏదేదో మాట్లాడుతున్నా ఐబూప్రోఫెన్‌ ఇవ్వచ్చు. ఒకవేళ వైద్యులు వైరల్‌ జ్వరమని నిర్ధారిస్తే పెద్దగా మందులు వెయ్యక్కర్లేదు. ఒకవేళ ఇతరత్రా కారణాలతో జ్వరం వస్తుంటే.. ముందు వాటిని గుర్తించిన తర్వాతే యాంటీబయాటిక్‌ల వంటివి ఇవ్వాలి. కారణాన్ని గుర్తించకుండా మందులు మొదలెట్టే కంటే మరో రోజు జ్వరంతో వేచి ఉన్నా తప్పులేదని తల్లిదండ్రులు తెలుసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*

******************

ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.


కామెంట్‌లు లేవు: